News January 30, 2025

కొత్తగూడెం: ఫిబ్రవరి 15న సెలవు ఇవ్వాలి: LHPS

image

చండ్రుగొండ మండలం వెంకట్య తండాలో జరిగిన LHPS సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి కోట్యా నాయక్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా లంబాడీలు మాట్లాడే గోర్ బోలి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్డ్‌లో చేర్చి, అధికారిక భాషగా గుర్తించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్నారు. ఫిబ్రవరి 15న సేవాలాల్ జయంతికి దేశవ్యాప్తంగా సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

Similar News

News March 14, 2025

నల్గొండ: ఈనెల 17, 18 తేదీల్లో కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల వంటా వార్పు

image

రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనెల 17, 18 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు కలెక్టరేట్ ఎదుట వంట వార్పు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సిఐటీయూ జిల్లా నాయకులు అవుటు రవీందర్ తెలిపారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమస్యలతో కూడుకున్న మెమోరాండం నల్గొండ జిల్లా కార్యాలయంలో సమర్పించారు.

News March 14, 2025

 టెన్త్ ఎగ్జామ్స్‌..ఎలా చదువుతున్నారు: కలెక్టర్

image

పదవ తరగతి పరీక్షలు దగ్గర పడ్డాయని, కష్టపడి చదువుకుంటే మంచి మార్కులు వస్తాయని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కొండాపూర్ కస్తూర్బా పాఠశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులు ఎలా చదువుతున్నారు అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చదివించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మండల విద్యాధికారి దశరథ్ పాల్గొన్నారు.

News March 14, 2025

వర్గల్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

image

వర్గల్ మండలం గౌరారం రాజీవ్ రహదారిపై ఈనెల 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో గౌరారంలో నివాసం ఉంటున్న దుర్గాప్రసాద్ (28) అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆర్వీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడు దుర్గాప్రసాద్‌కు భార్య, రెండు సంవత్సరాల కూతురు, రెండు నెలల బాబు ఉన్నారు.

error: Content is protected !!