News April 16, 2025
కొత్తగూడెం: యువతి చదువుకు బాబుమోహన్ భరోసా

కొత్తగూడెం(D) అశ్వారావుపేటకు చెందిన యువతి చదువుకు ప్రముఖ నటుడు బాబు మోహన్ భరోసానిస్తూ ముందుకు వచ్చారు. మండలంలోని బండారిగుంపునకు చెందిన బైట గోపాలరావు రెండో కుమార్తె సమీప బీటెక్ పూర్తి చేసింది. ఎంటెక్ చదవడానికి బాబుమోహన్ ముందుకు వచ్చి తన కుమారుడి ట్రస్ట్ పేరు మీద చదువు పూర్తి చేయిస్తానని హామీనిచ్చారు. చదువు పూర్తిచేసి ఫారెస్ట్ రేంజ్ అధికారిణి అవుతానని సమీప ఆయనకు తెలిపింది.
Similar News
News April 16, 2025
VZM: స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు

విజయనగరం ఉమ్మడి జిల్లాలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల మంజూరుకు మంగళవారం జీవో విడుదలైంది. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు విద్యను అందించేందుకు నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ప్రైమరీ లెవెల్ SGTలు 45, సెకండరీ లెవెల్ స్కూల్ అసిస్టెంట్లు 115 కాగా గతంలోనే 49 పోస్టులు మంజూరు చేసింది. తాజాగా 66 పోస్టులను కేటాయిస్తూ డీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేస్తామని ప్రకటించింది.
News April 16, 2025
ఖమ్మం జిల్లా ప్రజలకు విద్యుత్ శాఖ విజ్ఞప్తి

ఖమ్మం జిల్లా ప్రజలకు విద్యుత్ శాఖ విజ్ఞప్తి చేసింది. మంగళవారం రాత్రి భారీ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో తమ ప్రాంతాల్లో విద్యుత్తు లైన్ల పై చెట్టుకొమ్మలు లేదా స్తంభాలు విరిగిపడినట్లు ఉంటే వెంటనే విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలన్నారు. విద్యుత్ సంబంధిత సమస్యలు ఉంటే 1912 నంబర్ కు కాల్, లేదా విద్యుత్ అధికారులకు సమాచారం అందించాలని విద్యుత్ అధికారులు ప్రకటించారు.
News April 16, 2025
ఉమ్మడి నెల్లూరు జిల్లాకు 107 పోస్టుల మంజూరు

రాష్ట్రంలోని 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను ప్రభుత్వం సృష్టించింది. ఇందులో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు కొత్తగా 107పోస్టులు రానున్నాయి. వీటిలో 63 ఎస్‌జీటీ, 44 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 105 స్కూల్ అసిస్టెంట్ టీచర్లు అవసరం కాగా గతంలోనే 61 పోస్టులు మంజూరు చేసింది. తాజాగా 44 పోస్టులను కేటాయిస్తూ డీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేస్తామని ప్రకటించింది.