News March 5, 2025
కొత్తగూడెం: రూ.10.30లక్షల గంజాయి పట్టివేత

భద్రాచలం పట్టణంలోని ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద మంగళవారం టౌన్ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో 2 ద్విచక్ర వాహనాలపై వస్తున్న ముగ్గురు వ్యక్తులను ఆపి తనిఖీ చేయగా వారి వద్ద రూ.10.30 లక్షలు విలువ గల 20 కేజీల గంజాయి పట్టుబడింది. గంజాయిని హైదరాబాద్‌కు తరలిస్తుండగా భద్రాచలంలో పట్టుకున్నట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. వీరంతా సుక్మా జిల్లాకు చెందిన వారిగా విచారణలో తేలిందని ఎస్ఐ పేర్కొన్నారు.
Similar News
News March 6, 2025
తిరుపతి: దొంగల ముఠా అరెస్ట్

ఎవరు లేని ఇళ్లను పగలు నిఘా పెట్టి రాత్రి సమయాల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. వారి నుంచి రూ.35 లక్షల విలువగల 501 గ్రా. బంగారం, 1,20,000 విలువగల 2116 గ్రాముల వెండి నగలు, ఒక కారు, ఒక ఆటో, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో కొందరిపై పలు కేసులు నమోదు అయ్యాయని వివరించారు. వీరిని పట్టుకోవడంలో ప్రతిభ చాటిన పోలీసులను ఎస్పీ అభినందించారు.
News March 6, 2025
ఈనెల 8న మహిళాశక్తి పాలసీ విడుదల

TG: ఈనెల 8న జరగనున్న మహిళా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా శక్తి పాలసీ విడుదల చేయనున్నట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. ఈ సందర్భంగా సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్‌లో సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చే అవకాశముండటంతో తగిన ఏర్పాట్లు చేయాలని, మజ్జిగప్యాకెట్లు అందించాలని అధికారులను ఆదేశించారు.
News March 6, 2025
సంగారెడ్డి: MLC కౌంటింగ్.. 60 గంటలు సాగింది

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. ఈనెల 3న ఉ. 8 గంటలకు చెల్లుబాటయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేయడం మెుదలు పెట్టగా మంగళవారం ఉ. 10 గంటల వరకు ఈ ప్రక్రియ సాగింది. 11 గంటలకు అభ్యర్థులకు పోలైన ఫస్ట్ ప్రయార్టీ ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేయగా బుధవారం 8 గంటలకు అంటే సుమారు 60 గంటల వరకు సాగింది.