News March 21, 2024

కొత్తగూడెం: విద్యార్థినులను దత్తత తీసుకున్న ఎస్సై

image

తల్లిదండ్రులను కోల్పోయినా విద్యలో రాణిస్తున్న ఇద్దరు పేద విద్యార్థినులను దత్తత తీసుకుని, వారి చదువుల బాధ్యతను చర్ల ఎస్సై టీవీఆర్‌.సూరి స్వీకరించారు. చర్లలోని కస్తూర్భా పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన పదో తరగతి విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనిత, తల్లిని కోల్పోయిన శిరీష పరిస్థితి తెలుసుకుని చలించారు. వారు ఎంత వరకు చదివినా తనదే బాధ్యత అని తెలిపారు.

Similar News

News April 10, 2025

భద్రాద్రి: 2నాటు తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం

image

భద్రాద్రి(D) అశ్వారావుపేట(M) కంట్లం ఎఫ్‌బీఓలు గుబ్బల మంగమ్మ తల్లి గుడి సమీప అటవీ ప్రాంతంలో 2 నాటు తుపాకులు, పేలుడు పదార్థాలతో సంచరిస్తున్న ముగ్గురు వేటగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్ఆర్ఓ మురళి వివరాలు.. పోలీసులు గస్తీ నిర్వహించగా, అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఏపీ(S) ఏలూరు(D) బుట్టాయగూడెంకు చెందిన కారం రవి, కామ మంగబాబు, వంజం నవీన్‌లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని వివరించారు.

News April 10, 2025

ఈవీఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి: ఖమ్మం కలెక్టర్

image

రఘునాథపాలెం: ఈవీఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘాతో భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం  కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్ నెలవారీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవీఎం గోడౌన్ సీళ్లను కలెక్టర్ పరిశీలించారు. అగ్నిమాపక పరికరాలు, సిసి కెమెరాలను పరిశీలించారు. భద్రతా సిబ్బంది షిఫ్టుల వారి విధుల గురించి అడిగి తెలుసుకున్నారు.

News April 10, 2025

ఖమ్మం జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు

image

ఖమ్మంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బుధవారం ఎర్రుపాలెంలో అత్యధికంగా 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అటు ముదిగొండలో 40.8, నేలకొండపల్లిలో 40.5, ఖమ్మం(U) ఖానాపురం PS, ఖమ్మం(R) పల్లెగూడెంలో 40, లింగాల (కామేపల్లి), కారేపల్లిలో 39.2, సత్తుపల్లిలో 39, మధిరలో 38.6, మంచుకొండ (రఘునాథపాలెం) 38.5, తల్లాడలో 38.5, కల్లూరులో 37.5, గౌరారం ( పెనుబల్లి) 37.1 నమోదైంది.

error: Content is protected !!