News February 25, 2025

కొత్తగూడెం: సత్వర చర్యలు తీసుకోండి: అదనపు కలెక్టర్లు

image

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు.

Similar News

News February 25, 2025

ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES!

image

√ ఖమ్మం నగరంలో జాబ్ మేళా √ ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన √ పెనుబల్లి: ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు √ పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష √ వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన √ సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం √ మధిరలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన √ సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన.

News February 25, 2025

మద్దూరు: భర్తపై కేసు పెట్టిన భార్య

image

భార్య కేసు పెట్టడంతో పోలీసులు భర్తను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని హన్మానాయక్ తండాకు చెందిన భాస్కర్ మద్యానికి బానిసయ్యాడు. రోజు తాగి వచ్చి భార్యతో గొడవపడేవాడు. కాగా. జనవరి 28న భార్యను కొట్టడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. భాస్కర్‌ను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధిస్తూ న్యాయాధికారి తీర్పునిచ్చారు.

News February 25, 2025

కీసరగుట్టపై నేటి కార్యక్రమాలు

image

కీసరగుట్ట శ్రీ భవాని శివదుర్గా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభం అయ్యాయి. 2వ రోజు మంగళవారం కార్యక్రమాలు: ఉదయం 9:00 గంటలకు రుద్రస్వాహాకార హోమం, సాయంత్రం 4:00 గంటలకు జ్వాలార్చన, రాత్రి 7:00 గంటలకు ప్రదోషకాల పూజ, రాత్రి 8:00 గంటలకు శ్రీ రామలింగేశ్వర స్వామి కీసర నుంచి కీసర గుట్టకు బయలుదేరుతారు. రాత్రి10:00 గంటలకు స్వామి వారి కళ్యాణం వైభవంగా జరగనుంది.

error: Content is protected !!