News March 2, 2025
కొత్తగూడెంకి ఎయిర్ పోర్ట్.. కేంద్రమంత్రి క్లారీటీ..!

కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. గతంలో ప్రభుత్వం ఓ స్థలం కేటాయించిందని.. కానీ ఆస్థలం ఫీజుబిలిటీ లేదని ప్రభుత్వానికి తెలపగా మరో స్థలం కేటాయించిందన్నారు. అక్కడ AAI ఫీజుబిలిటీ స్టడీ చేసిందన్నారు. కానీ ఆ స్థలానికి రిమార్క్స్ ఉన్నాయని ఆ ప్రాంతం డేటా కావాలని ప్రభుత్వానికి సూచించామన్నారు. ఆ డేటా వచ్చిన తరువాత పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
Similar News
News April 23, 2025
27న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు: ఖమ్మం DEO

తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు ఈ నెల 27న (ఆదివారం) నాడు నిర్వహిస్తున్నట్లు DEO సోమశేఖర్ వర్మ తెలిపారు. 6వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7-10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించబడతాయని చెప్పారు. పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షా పత్రాల లీకేజీ వదంతులు నమ్మవద్దని సూచించారు.
News April 23, 2025
ఖమ్మం: కేయూ పీజీ పరీక్షలు వాయిదా

ఈనెల 26న ప్రారంభం కావాల్సిన వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ (రెగ్యులర్) 4వ సెమిస్టర్ పరీక్షలు జూన్ 6కు వాయిదా పడ్డాయి. మే 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులను ప్రకటించిన నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడ్డాయని రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 23 నుంచి 30 వరకు ప్రయోగ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
News April 23, 2025
ఖమ్మం: సివిల్స్‌లో 231వ ర్యాంకు సాధించిన చరణ్ తేజ

ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి నామవరం గ్రామానికి చెందిన నర్సింశెట్టి చరణ్ తేజ దేశవ్యాప్తంగా విడుదలైన సివిల్స్ పరీక్షలో 231వ ర్యాంకు సాధించారు. ఈ విజయంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చరణ్ తేజ సాధించిన విజయం యువతకు ఆదర్శంగా నిలుస్తుందని గ్రామస్థులు ప్రశంసించారు.