News March 24, 2024
కొత్తచెరువులో వ్యక్తి కిడ్నాప్

కొత్తచెరువులో ఆదివారం తెల్లవారుజామున చికెన్ వ్యాపారి ఉప్పు చలపతి కిడ్నాప్ కలకలం రేపింది. తెల్లవారుజామున నాలుగు గంటలకు గుర్తు తెలియని దుండగులు చలపతిని ఆయన ఇంటి నుంచి కారులో కిడ్నాప్ చేశారు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీ పుటేజ్ ఆధారంగా కిడ్నాప్ ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చలపతి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Similar News
News April 24, 2025
స్వచ్ఛతలో అనంతపురం జిల్లాకు అవార్డు

స్వచ్ఛ ఆంధ్ర అమలులో అనంతపురం జిల్లాకు అవార్డు దక్కింది. రాష్ట్రంలోనే తొలి స్థానంలో అనంతపురం, ద్వితీయ స్థానంలో సత్యసాయి జిల్లా నిలిచాయి. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కృష్ణతేజ ప్రకటించారు. నేడు విజయవాడలో జరగనున్న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ అవార్డును అందుకోనున్నారు.
News April 24, 2025
ఈతకు వెళ్లి బీఫార్మసీ విద్యార్థి మృతి

నెల్లూరు జిల్లాలో చదువుకుంటున్న అనంతపురం యువకుడు ఈతకు వెళ్లి మృతిచెందాడు. కళ్యాణదుర్గం మండలం గొల్ల గ్రామానికి చెందిన అంజి నార్త్ రాజుపాలెంలోని వేంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజీలో బీఫార్మసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీకి సమీపంలోని రేగడిచిలక వద్ద బావి దగ్గరికి ఐదుగురు విద్యార్థులతో కలిసి ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో బావిలో మునిగి చనిపోయాడు.
News April 23, 2025
కూలీ కుమారుడికి 593 మార్కులు

గుత్తి మోడల్ స్కూల్ విద్యార్థి నరసింహ పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటారు. 593 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచారు. నరసింహ తండ్రి ఐదేళ్ల క్రితం మృతిచెందగా తల్లి కళావతి కూలీ పని చేస్తూ కొడుకును చదివిస్తోంది. పేదింటి బిడ్డ మంచి మార్కులతో సత్తా చాటడంతో ఉపాధ్యాయులు, బంధువులు విద్యార్థిని అభినందించారు. తల్లి కళావతి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.