News April 13, 2025
కొత్తవలస: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

కొత్తవలస మండలం గొల్లలపాలెం గ్రామానికి చెందిన సర్వసిద్ధి వినయ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో శనివారం రాత్రి మృతి చెందాడు. వాహనం బలంగా ఢీకొనడంతో అవయవాలు రోడ్డుపై పడి భయానక వాతావరణం చోటుచేసుకుంది. ఎస్.కోట ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వినయ్ కుమార్ (27)కి 2023లో వివాహం జరిగింది.
Similar News
News April 16, 2025
ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి: ఎంపీ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని విజయనగరం, విశాఖ ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు, భరత్ కోరారు. కలెక్టరేట్‌లో బుధవారం డిస్ట్రిక్ట్ ఎలక్ట్రసిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. పిఎం సూర్య ఘర్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఫర్ ఇంస్టాలేషన్ గ్రౌండ్ సోలార్ ప్లాంట్స్ ఎస్సి, ఎస్టి లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అంబేడ్కర్, అధికారులకు సూచించారు.
News April 16, 2025
అయోధ్యకు బొబ్బిలి వీణ: బేబినాయన

బొబ్బిలి వీణను అయోధ్యకు పంపించనున్నట్లు ఎమ్మెల్యే బేబినాయన తెలిపారు. బొబ్బిలి మున్సిపాలిటీలోని గొల్లపల్లిలో తయారు చేస్తున్న ఆ వీణను బుధవారం పరిశీలించారు. అయోధ్యలో బొబ్బిలి వీణను ప్రదర్శనకు ఏర్పాటు చేసి వీణ విశిష్టతను చెపుతామన్నారు. వీణల తయారీకి అవసరమయ్యే పనస కర్ర సరఫరా చేయాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. పనస కర్ర సరఫరాకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
News April 16, 2025
బరువు తక్కువ ఉన్న పిల్లలు పట్ల జాగ్రత్తగా ఉండాలి: సీడీపీవో

బరువు తక్కువ ఉన్న పిల్లలు పట్ల జాగ్రత్తగా ఉండాలని ఐసీడీఎస్ సీడీపీవో ఉమాభారతి కోరారు. గంట్యాడ మండలం రావివలసలో బుధవారం జరిగిన పోషణ పక్వాడ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లల బరువు చూసి బరువు తక్కువ ఉన్న పిల్లలను విజయనగరం ఘోషాసుపత్రిలో చేర్పించాలని తల్లులకు సూచించారు. పౌష్టికాహారం ఇస్తేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు పాల్గొన్నారు.