News April 5, 2025
కొమరోలు: భర్తపై యాసిడ్ పోసిన భార్య

గిద్దలూరు నియోజకవర్గం కొమరోలు (మం) బాదినేనిపల్లెకి చెందిన ప్రసన్న, నాగార్జున ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ రాజంపేటలోని బోయినపల్లెలో నివాసం ఉంటున్నారు. ఇద్దరి మధ్య గొడవల కారణంగా మార్చి 23వ తేదీన నాగార్జునకు ప్రసన్న మత్తు మందు ఇచ్చి అతనిపై యాసిడ్ పోసి పరారైంది. కుటుంబ సభ్యులు నాగార్జునను తిరుపతి, కడప, కర్నూల్ వైద్యశాలలో చికిత్స ఇప్పించారు. శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News April 6, 2025
NGKL: పండగను ప్రజలు శాంతియుతంగా నిర్వహించుకోవాలి: SP

NGKL జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ శ్రీరామనవమి పండగను ప్రజలు శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. జిల్లా ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు పండగల ప్రాధాన్యతను గుర్తించుకోవాలని సూచించారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం విశిష్ట లక్షణమని తెలిపారు. ప్రతి వ్యక్తి ఎదుటి వ్యక్తిని గౌరవిస్తూ అభివృద్ధివైపు అడుగులు వేయాలని సూచించారు.
News April 6, 2025
సఖినేటిపల్లి: కచ్చడా చేప రేటు అదుర్స్.. రూ.70 వేలు

సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్‌కు 25 కిలోల కచ్చడా చేప శనివారం మత్స్యకారులు తీసుకువచ్చారు. వేలంలో ఆ చేప రూ.70 వేల ధర పలికింది. దీంతో ఆ చేప చిక్కిన మత్స్యకారుల పంట పండింది. ఇది ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ చేప అని తెలిపారు. ఈ చేపకు ఇంత ధరా? అంటూ ఆశ్చర్యపోయిన స్థానికులు చేప వద్ద నిల్చొని సెల్ఫీలు తీసుకున్నారు.
News April 6, 2025
NGKL: పండగను శాంతియుతంగా చేసుకోవాలి: కలెక్టర్

నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శ్రీరామ నవమి సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రజలందరిపై భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు శాంతియుతంగా ఆనందోత్సవాల మధ్య పండగను చేసుకోవాలన్నారు. ప్రకృతిని రక్షించాలని అప్పుడే మనం రాబోయే తరాలకు బంగారు భవిష్యత్తును అందించిన వారమవుతామని తెలిపారు.