News April 22, 2025

కొమురం భీం జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు

image

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా రెబ్బెన మండలంలో 43.8 ఉష్ణోగ్రత ఉండగా ఆసిఫాబాద్, సిర్పూర్‌టి 43.7, పెంచికల్పేట్ 43.6, కౌటాల 43.5, కెరామేరి, బెజ్జూరు 43.4, తీర్యాని 43.3, దహేగాం, కాగజ్నగర్ 43.2, చింతలమానపల్లి 42.6, జైనూరు 42.1, లింగాపూర్ 40.1గా నమోదైంది.

Similar News

News April 22, 2025

వరంగల్: సెకండ్ ఇయర్ లోనూ వారే ముందజ!

image

వరంగల్ జిల్లాలో ఇంటర్ సెకండియర్ ఫలితాల్లోనూ బాలికలదే పైచేయి. మొత్తం 4743మంది పరీక్షలు రాయగా 3292(69.41%) మంది పాసయ్యారు. బాలికలు మొత్తం 2877 మందికి గాను 2263(78%) ఉత్తీర్ణులయ్యారు. బాలురులో మొత్తం 1866 మంది విద్యార్థులకు గాను 1029మంది(55.14%) ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా ఒకేషనల్‌లో బాలికలు 431 మంది విద్యార్థులకు గాను 347(80.51%) మంది.. బాలురు 227 మందికి 70(30.84%) మంది పాసయ్యారు.

News April 22, 2025

UPDATE: ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఎంతమంది పాసంటే?

image

ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ కోర్సులో మొత్తం 15,056 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 8,035 మంది ఉత్తీర్ణులు అయినట్లు DIEO తెలిపారు. వీరిలో బాలికలు 8,074 మంది హాజరు కాగా 5,191 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 6,982 మంది పరీక్షలకు హాజరు కాగా 2,844 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులు మొత్తం 2,790 మంది పరీక్షలకు హాజరుకాగా 1,223 ఉత్తీర్ణులయ్యారని వివరించారు.

News April 22, 2025

కడప జిల్లా యువతికి 494 మార్క్స్

image

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో కడప జిల్లా యువతి సత్తా చాటింది. ఎర్రగుంట్ల మండలం చిన్నదండ్లూరుకు చెందిన ఎద్దుల శివారెడ్డి, లక్ష్మీకొండమ్మ కుమార్తె పూజిత ఎంఈసీ చదువుతోంది. 500 మార్కులకు గాను 494 సాధించింది. ఇంగ్లిషులో 78, సంస్కృతంలో 99, మ్యాథ్స్ 1ఏలో 50, 1బీలో 50, ఎకనామిక్స్‌లో 99, కామర్స్‌లో 98, ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌లో 20 మార్కులతో సత్తా చాటింది. ఆమెను అందరూ అభినందించారు.

error: Content is protected !!