News March 15, 2025
కొమ్మాల జాతరకు పోటెత్తిన భక్తులు

కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతరకు శనివారం భక్తులు పోటెత్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు గ్రామాల నుంచి ప్రజలు వచ్చి తమ మొక్కులు లక్ష్మీ నరసింహ స్వామికి చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని విధాలా వసతులు కల్పించామని ఈవో అద్దంకి నాగేశ్వరరావు తెలిపారు.
Similar News
News March 18, 2025
వరంగల్: ‘పది’ పరీక్ష పదిలంగా!

ఈ నెల 21 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాగా పరీక్షలు దగ్గర పడటంతో కొంతమంది విద్యార్థులు గాబరా పడి సమాధానం తెలిసినా సరిగా రాయలేకపోతుంటారు. వారంతా ఒత్తిడికి లోనుకాకుండా నేను బాగా చదివాను.. బాగా రాస్తాను అని కాన్ఫిడెంట్‌గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వీరంతా సెల్‌ఫోన్, టీవీకి దూరంగా ఉన్నట్లయితే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో 9,237 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
News March 18, 2025
చిగురాకు తొడిగిన భారతావని ‘చివరి’ అంచు!

ఆకాశం అందమైన కాన్వాస్ అయితే దానిపై ప్రతి రోజు రూపుదిద్దుకున్న చిత్రాలెన్నో. కళాత్మకంగా కూడిన మనసు ఉండాలే కానీ ఆకాశంలో ఉండే మేఘాలు, ఏపుగా పెరిగిన చెట్లు ఎన్నో రకాల అద్భుతమైన రూపంలో కనిపిస్తాయి. వరంగల్ నగరంలోని నర్సంపేట రోడ్డులో పచ్చని చెట్ల కొమ్మలు భారతదేశ పటం చివరి భాగం రూపంలో పచ్చదనంతో అల్లుకొని ఉన్న చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ దృశ్యం చూపరులను ఆకట్టుకుంటోంది.
News March 18, 2025
ప్రజావాణిలో దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ అధికారులతో కలిసి ప్రజల నుంచి సమస్యల దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 94 దరఖాస్తులు రాగ, రెవిన్యూ శాఖకు 20, పోలీస్ శాఖకు 11 వైద్య ఆరోగ్యశాఖకు 7, పౌర సంబంధాల శాఖ 7, కలెక్టరేట్ 6, జి డబ్ల్యూఎంసీ 6 , విద్యాశాఖకు 4 దరఖాస్తులు వచ్చాయి.