News February 8, 2025

కొలిమిగుండ్ల వద్ద ఆర్టీసీ బస్సులో వ్యక్తి మృతి

image

జమ్మలమడుగు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు.. కడప జిల్లా మైలవరం మండలం వేపరాలకు చెందిన నాగయ్య(42) తాడిపత్రి నుంచి జమ్మలమడుగు వెళ్లేందుకు బస్సు ఎక్కారు.  కొలిమిగుండ్ల వద్ద గుండెపోటుకు గురైన ఆయన సీట్లో నుంచి కుప్పకూలి కింద పడ్డారు. అనంతరం ప్రయాణికులు పరిశీలించగా అప్పటికే మృతిచెందారు. 

Similar News

News December 15, 2025

ఇతిహాసాలు క్విజ్ – 97 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: ఈ ఆలయంలో కొలువైన అంజన్న స్వామికి రెండు ముఖాలు ఉంటాయి. అందులో ఒకటి హనుమంతుడిది కాగా, మరొకటి నరసింహస్వామిది. మూల విరాట్టు భుజాలపై శంఖుచక్రాలు, ఛాతి మీద సీతారాముని రూపాలు కూడా కనిపిస్తాయి. ఈ ఆలయం తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది.
సమాధానం: కొండగట్టు అంజన్న స్వామి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 15, 2025

రాష్ట్రంలోనే బాపట్ల జిల్లాకు ఏడో స్థానం

image

ఇ-ఆఫీస్ విధానాన్ని అధికారులు అలవర్చుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. ఈ-ఆఫీస్ విధానంలో రోజుకు 9 గంటల్లో జిల్లాలో 1,363 ఫైల్స్ పరిశీలన, పరిష్కారంపై రాష్ట్రంలోనే 7వ స్థానంలో నిలిచానన్నారు. దీంతో జిల్లా అధికారులు కలెక్టర్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఖజానా శాఖలో ఈ-ఫైల్స్ ఒక్కటి కూడా నమోదు కాకపోవడంపై ఆరా తీశారు. నిర్లిప్తంగా ఉండరాదని, కచ్చితంగా ఈ-ఫైలింగ్ చేపట్టాలని ఆదేశించారు.

News December 15, 2025

NTR: సూట్లు వేసి కోట్లలో కుంభకోణం..!

image

విస్సన్నపేట కేంద్రంగా రూ.కోట్ల కుంభకోణానికి పాల్పడిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థకు సంబంధించి ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. చదువు రానివారికి సూట్లు వేసి, ఫోటోలను డిజిటల్‌గా మార్చి డైరెక్టర్లుగా చూపించి ప్రజలను మోసం చేశారు. ఈ విషయం తెలుసుకుని బాధితులు విస్తుపోతున్నారు. డైరెక్టర్ల నుంచి రికవరీ చేసి న్యాయం చేయాలని కోరుతున్నారు.