News March 19, 2024
కొల్లాపూర్: మంచంపైనే పరీక్ష రాసిన విద్యార్థి

కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి సాంబశివుడికి నెల కిందట ప్రమాదంలో కాలు విరిగింది. సోమవారం కుమారుడు తెలుగు పరీక్ష రాసేందుకు తల్లిదండ్రులు బయ్యన్న, సుజాత మరో సహాయకుడితో మంచంతో సహా ఆటోలో కొల్లాపూర్ లోని పరీక్ష కేంద్రానికి తరలించారు. ముందస్తు అనుమతితో సాంబశివుడిని మంచంపైనే కూర్చొని పరీక్ష రాయించినట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు.
Similar News
News April 8, 2025
MBNR: దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజావాణి దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశపుహాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 92 ఫిర్యాదులను స్వీకరించారు. ఏ వారం దరఖాస్తులు ఆ వారమే పరిష్కరించాలని పదేపదే హెచ్చరిస్తున్న నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. శనివారంలోగా దరఖాస్తులను పరిష్కరించి తనకు నివేదిక ఇవ్వాలన్నారు.
News April 7, 2025
మహబూబ్‌నగర్: ‘మాంసం వారానికి ఒకసారే తినండి’

ఉమ్మడి <<16019120>>పాలమూరులో<<>> 18 ఏళ్లు పైబడిన వారిలో సగటున 20 శాతం అంటే 87,739 మంది అధిక రక్తపోటు బాధితులే ఉన్నారు. క్యాన్సర్ రోగులు 188మంది, మధుమేహ వ్యాధిగ్రస్థులు 50,421మంది ఉన్నారు. మటన్, ఆయిల్‌ఫుడ్, అధిక ఉప్పు, పచ్చడి, తంబాకు, గుట్కా, బ్రెడ్, బేకరీ ఫుడ్ తినొద్దని, స్కిన్‌లెస్ చికెన్, గుడ్డు తెల్ల సొన, ఉడకబెట్టిన కూరగాయలు, పాలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. వారానికి ఒకసారి మాత్రమే మాంసం తినాలన్నారు.
News April 7, 2025
వనపర్తి: ‘సింగోటం గుడిలో ప్రేమ జంట పెళ్లి చేస్తాం’

తమకు పెళ్లి చేయాలని వనపర్తి జిల్లా పానగల్ PSకు వచ్చిన <<16017433>>నందిని, మహేందర్<<>> పెళ్లి త్వరలో చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. నందిని హైదరాబాద్‌లో ఫామ్-డి చదువుతోందని, మహేందర్ డిగ్రీ చదివి జాబ్ సెర్చ్ చేస్తున్నాడన్నారు. ఇద్దరు మేజర్లు, అందులోనూ చదువుకున్న వారు కావడంతో వారి పెళ్లికి కుటుంబీకులను ఒప్పించామని చెప్పారు. మంచి ముహూర్తం చూసి త్వరలో కొల్లాపూర్ పరిధి సింగోటం గుడిలో పెళ్లి చేస్తామన్నారు.