News September 30, 2024
కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఉత్సవాల UPDATES
కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఉత్సవాలకు హాజరుకానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం మొదటి రోజున అమ్మవారిని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడులు కుటుంబసమేతంగా దర్శించుకోనున్నారు. సామాన్య భక్తులకు ఉచిత దర్శనం, రూ.20, రూ.50 దర్శనాలను కల్పించనున్నారు.
Similar News
News November 25, 2024
సీతంపేట: విషాదం మిగిల్చిన వనభోజనం
సీతంపేట మండలం అడలి వ్యూ పాయింట్ వద్ద ఆదివారం వన భోజనానికి వెళ్లిన ఒక కుటుంబం తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. వారు వెళ్తున్న బైక్ అదుపు తప్పి లోయలో పడింది. బైక్ మీద ఉన్న దుప్పాడ భారతి(33) (విద్య కమిటీ ఛైర్మన్) మృతి చెందారు. భర్త దుర్గారావు, చిన్నారులు మేఘన, పల్లవికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని పాలకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
News November 25, 2024
SKLM: అయ్యప్పస్వామి భక్తులకు ప్రత్యేక రైలు
అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం శ్రీకాకుళం నుంచి నేరుగా శబరిమల (కొల్లం) వరకు ప్రత్యేక రైలును డిసెంబరు 1 నుంచి జనవరి 19 తేదీ వరకు ప్రతి ఆదివారం నడుస్తుందని, రైలు ప్రారంభించడంపై సంతోషంగా ఉందని మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ రైలు మంజూరు చేసినందుకు రైల్వే అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. భక్తులందరికీ సురక్షితంగా, శుభప్రదమైన యాత్ర జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు.
News November 25, 2024
శ్రీకాకుళం: హాల్ టికెట్లు ఇవ్వకుంటే చర్యలు-కలెక్టర్
డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ వంటి కోర్సుల్లో ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిల పేరుతో పరీక్షలు సంబంధించిన హాల్ టికెట్లు అందించలేకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులకు పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు కచ్చితంగా అందజేయాలని కళాశాలలకు స్పష్టం చేశారు. ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తుందని అన్నారు.