News April 23, 2025

కోడూరు: ఫోక్సో కేసులో యువకుడి అరెస్టు

image

కోడూరు మండలం రాఘవ రాజాపురం హరిజనవాడకు చెందిన కూని వెంకటేశ్(శివమణి)ను పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని మంగళవారం అరెస్టు చేశామని సీఐ హేమ సుందర్ తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా.. కోడూరు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు.

Similar News

News April 23, 2025

HYD: MLC ఎన్నిక.. 112లో 88 మంది ఓటు

image

22 ఏళ్ల తర్వాత జరిగిన హైదరాబాద్ MLC కోటా ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు 112 ఓటర్లు ఉండగా మొత్తం 88మంది ఓటు వేశారు. 24 మంది BRS ఓటర్లు మినహాయిస్తే MIM, కాంగ్రెస్, BJP సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటల వరకు 37.51%, మ. 12 గంటల వరకు 77.68%, మధ్యాహ్నం 78.57% ఓటింగ్ నమోదు అయ్యింది.

News April 23, 2025

అద్భుతమైన క్యాచ్‌లు కాదు.. క్యాచ్ పడితే అద్భుతం!

image

IPL: ఫీల్డింగ్‌లో ఈ ఏడాది అన్ని జట్ల ప్రదర్శన పేలవంగా ఉంది. ఇప్పటి వరకు 40 మ్యాచు‌లు జరగ్గా, అన్ని జట్లు కలిపి 111 క్యాచ్‌లు వదిలేశాయి. 247 మిస్‌ఫీల్డ్స్, 172 రనౌట్స్ మిస్ చేశాయి. 2020 నుంచి తొలి 40 మ్యాచ్‌లతో పోలిస్తే ఇదే చెత్త ప్రదర్శన. MI జట్టు ఒక్కటే 83.6% క్యాచింగ్ పర్సంటేజ్‌తో కాస్త మెరుగ్గా ఉంది. గతంలో అద్భుతమైన క్యాచ్‌లు చూసిన ఫ్యాన్స్ ప్రస్తుతం పట్టిన ప్రతి క్యాచ్‌నూ అద్భుతం అంటున్నారు.

News April 23, 2025

HYD: MLC ఎన్నిక.. 112లో 88 మంది ఓటు

image

22 ఏళ్ల తర్వాత జరిగిన హైదరాబాద్ MLC కోటా ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు 112 ఓటర్లు ఉండగా మొత్తం 88 మంది ఓటు వేశారు. 24 మంది BRS ఓటర్లు మినహాయిస్తే MIM, కాంగ్రెస్, BJP సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటల వరకు 37.51%, మ. 12 గంటల వరకు 77.68%, మధ్యాహ్నం 78.57% ఓటింగ్ నమోదు అయ్యింది.

error: Content is protected !!