News March 22, 2024
కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జి సృజన హెచ్చరించారు. శుక్రవారం ఎన్నికల అంశాలపై ఆర్వోలు, మునిసిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపీడీఓలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీ విజిల్ ఫిర్యాదులను నిర్దేశిత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. కోడ్ ఉల్లంఘనకు సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News April 19, 2025
ఆదోని మెడికల్ కాలేజీపై ఆరోగ్యశాఖ మంత్రి స్పందన

కర్నూలు జీజీహెచ్‌లో అవసరమైన ఐపీ బ్లాక్ నిర్మిస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వైద్యులు, సిబ్బందితో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. నిర్మాణ దశలో ఉన్న క్రిటికల్ కేర్ బ్లాక్‌ను త్వరలోనే పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామన్నారు. ఆదోని మెడికల్ కాలేజీని అన్ని వసతులతో వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.
News April 19, 2025
వెల్దుర్తి: పేడ రంగు నీళ్లు తాగి వివాహిత మృతి

వెల్దుర్తి మండలం యల్.కొట్టాలలో విషాదం నెలకొంది. సుహాసిని అనే వివాహిత ఇంట్లో ఎవరు లేని సమయంలో పేడరంగు నీళ్లు తాగి ఇద్దరు పిల్లలతో సహా శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు హుటాహుటిగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఇద్దరు పిల్లలు మాన్యశ్రీ (10), విలక్షణ (7) పరిస్థితి విషమంగా ఉంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News April 19, 2025
శ్రీనగర్ SSPగా కర్నూల్ వాసి.!

కర్నూలు జిల్లాకు చెందిన డాక్టర్ సందీప్ చక్రవర్తి జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ SSPగా నియమితులయ్యారు. శుక్రవారం జరిగిన IPS అధికారుల బదిలీల్లో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆయనను శ్రీనగర్ SSPగా నియమించింది. కర్నూలు జిల్లాకు చెందిన ఆయన కీలక పదవుల్లో చేయడంపై చిన్ననాటి సన్నిహితులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.