News February 3, 2025
కోదాడ స్కూల్ నుంచి స్టూడెంట్స్ పరార్.. పట్టుకున్న పోలీసులు
కోదాడ మం. నెమలిపురి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు పారిపోవడం ప్రభుత్వ యంత్రాగాన్ని పరుగులు పెట్టించింది. ఎస్సై అనిల్ రెడ్డి వివరాలు.. పాఠశాల నుంచి ఆరుగురు విద్యార్థులు పారిపోగా ప్రిన్సిపల్ ఝాన్సీ PSలో ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారిని విజయవాడలో ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థులను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి కారణాలు అడిగి తెలుసుకున్నారు.
Similar News
News February 3, 2025
జగిత్యాలలో కిడ్నాప్ కలకలం
జగిత్యాల చింతకుంట వాడలో పట్టపగలు కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ఇంటి బయట ఆడుకుంటున్న పాపను ఓ జంట ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా స్థానికులు వారికి దేహశుద్ధి చేశారు. ఇంటి ముందు ఆడుకుంటున్న పాపకు చాక్లెట్ ఆశచూపి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. పాప వాళ్లను చూసి ఇంట్లోకి వెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తల్లిదండ్రులతో పాటు ఇరుగుపొరుగు వారు వారిని పట్టుకన్నారని స్థానికులు పేర్కొన్నారు.
News February 3, 2025
సంగారెడ్డి: రేపటి పరీక్ష ఈ నెల 10కి వాయిదా
సంగారెడ్డిలోని సైన్స్ మ్యూజియంలో మంగళవారం నిర్వహించనున్న భౌతిక రసాయన శాస్త్ర ప్రతిభ పరీక్ష ఈ నెల 10న నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. మండల స్థాయిలో గెలుపొందిన విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News February 3, 2025
NZB: బీజేపీ జిల్లా అధ్యక్షునిగా కులచారి దినేశ్
బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా కులచారి దినేశ్ రెండోసారి ఎన్నికయ్యారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి డా.కాసం వెంకటేశ్వర్లు ఓ ప్రకటన జారీ చేశారు. ఇటీవల జరిగిన సంస్థాగత ఎన్నికల సందర్భంగా దినేశ్ కులచారి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన రెండోసారి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. తనకు రెండోసారి అవకాశం కల్పించిన రాష్ట్ర నాయకులు కిషన్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.