News February 24, 2025
కోనసీమ జిల్లాలో 95 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్‌కు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 95 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా అధికారులు సోమవారం తెలిపారు. కోనసీమలోని 22 మండలాల్లో 64,471 మంది ఓటర్లు ఉన్నారన్నారు. వారిలో పురుషులు 37,114 మంది, మహిళా ఓటర్లు 27,355 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారన్నారు. ఈనెల 27వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. మార్చి 3వ తేదీన కౌంటింగ్ జరుగుతుందన్నారు.
Similar News
News February 24, 2025
జగన్ మరోసారి అసెంబ్లీకి రాక తప్పదా?

AP: మాజీ సీఎం జగన్ మరోసారి అసెంబ్లీకి రాక తప్పదని తెలుస్తోంది. ఇవాళ అసెంబ్లీ సెషన్‌లో సభ్యులు చేసిన సంతకాలను పరిగణనలోకి తీసుకోరని సమాచారం. గవర్నర్ ప్రసంగం కస్టమరీ సెషన్ మాత్రమేనని, స్పీకర్ అధ్యక్షతన జరిగే సమావేశాన్నే వర్కింగ్ డేగా పరిగణిస్తారని అసెంబ్లీ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ శాసనసభకు రాకపోతే సీటు వేకెంట్ అని ప్రకటించవచ్చని అంటున్నారు. దీంతో జగన్ మరోసారి అసెంబ్లీకి రాక తప్పదని సమాచారం.
News February 24, 2025
SSS: జిల్లా ఉప విద్యాశాఖ అధికారి బాధ్యతల స్వీకరణ

శ్రీ సత్యసాయి జిల్లా ఉప విద్యాశాఖ అధికారిగా సోమవారం పెనుకొండ పట్టణంలో పద్మప్రియ బాధ్యతలు స్వీకరించారు. పెనుకొండ ఉప విద్యాశాఖ అధికారిగా ఎఫ్ఎసీ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈమె చిలమత్తూరు మండలంలో మండల విద్యాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అదనంగా ఉప విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న రంగస్వామి బదిలీపై చిత్తూరు జిల్లాకు వెళ్లారు.
News February 24, 2025
కావలిలో మున్సిపల్ కార్మికుల పోస్ట్ కార్డులు ఉద్యమం

కావలి మున్సిపల్ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డు ద్వారా అప్కాస్ రద్దు, ప్రైవేటు ఏజెన్సీ వద్దని, తమను పర్మినేoట్ చేయాలని కోరుతూ సోమవారం కార్మికులు పోస్ట్ కార్డులు ప్రదర్శిస్తూ ఉద్యమాన్ని చేపట్టారు. సీఐటీయూ నేత పి.పెంచలయ్య మాట్లాడుతూ.. గతంలో ప్రైవేటు కాంట్రాక్టులో ఉన్నప్పుడు కార్మికులు జీతాల కొసం ఇబ్బందులు పడ్డారన్నారు. మళ్లీ సీఎం ఆ నిర్ణయాన్ని అమలు చేయడం మంచిది కాదని అన్నారు.