News March 31, 2025
కోనసీమ జిల్లాలో ఏప్రిల్ 2నుంచి ఉచిత కోచింగ్

జిల్లాలో ఏప్రిల్ 2 నుంచి రాష్ట్ర బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ ప్రారంభమవుతుంది. ఆలమూరు, కొత్తపేట, కాట్రేనికోన, అంబాజీపేట, పి.గన్నవరం, మామిడికుదురు, రాజోలు, మలికిపురం మండలాల్లో కోచింగ్ ఇస్తామని జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి సుబ్బరాజు సోమవారం తెలిపారు. పాలిటెక్నిక్, APRJC, స్పోకెన్ ఇంగ్లీష్, కెరీర్ గైడెన్స్‌పై పదవ తరగతి విద్యార్థులకు శిక్షణ ఇస్తారు.
Similar News
News April 3, 2025
ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షాలు

గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో గురువారం రాత్రికి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ ప్రకటనలో తెలిపాడు. అలాగే, జిల్లా పక్కనే ఉండే పల్నాడు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి భారీ ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
News April 3, 2025
PPF నామినీ పేర్లను మార్చేందుకు ఛార్జీలుండవు: నిర్మల

PPF అకౌంట్లలో నామినీ పేర్లను మార్చేందుకు కొన్ని ఆర్థిక సంస్థలు డబ్బులు వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చినట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పేర్ల మార్పు, అప్‌డేట్ కోసం గతంలో రూ.50 వసూలు చేేసేవారని, ప్రస్తుతం ఆ ఛార్జీలు చెల్లించే అవసరం లేకుండా గెజిట్ తీసుకొచ్చామన్నారు. అలాగే, తాజాగా తీసుకొచ్చిన బ్యాంకింగ్ సవరణ బిల్లు ప్రకారం నలుగురు నామినీలను చేర్చుకోవచ్చని పేర్కొన్నారు.
News April 3, 2025
బొల్లాపల్లి: కన్న తల్లిని హతమార్చిన కొడుకు

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. మండలంలోని వెల్లటూరు గ్రామంలో కన్న తల్లిని కొడుకు కొట్టి చంపాడు. వెల్లటూరుకు చెందిన సోమమ్మ మంచం మీద పడుకుని ఉండగా కుమారుడు బాదరయ్య కొట్టి చంపాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.