News January 7, 2025
కోనసీమ జిల్లాలో మహిళా ఓటర్లే ఎక్కువ
ప్రత్యేక ఓటర్ల సంక్షిప్త సవరణ తరువాత డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 15 లక్షల 31 వేల 161 మంది ఓటర్లు ఉన్నారు. ఇన్‌ఛార్జ్ డీఆర్ఓ మాధవి సోమవారం ఓటర్ల జాబితాను విడుదల చేశారు. మొత్తం ఓటర్లలో మహిళా ఓటర్లు 7 లక్షల 72 వేల 150 మంది, పురుషులు 7 లక్షల 58 వేల 984 మంది ఉన్నారు. కోనసీమ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన ఓటర్ల జాబితాలను కూడా ఆమె విడుదల చేశారు.
Similar News
News January 9, 2025
తూ.గో జిల్లా మీదుగా నడిచే 4రైళ్లు రద్దు
విజయవాడ డివిజన్ పరిధిలోని సాంకేతిక మరమ్మతుల కారణంగా ఈ నెల 11, 12న జిల్లా మీదుగా నడిచే 4రైళ్లను రద్దు చేస్తూ డివిజనల్ రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. 11న కాకినాడ పోర్టు- వైజాగ్, వైజాగ్- కాకినాడ పోర్టు (17267/17268), 12న గుంటూరు- వైజాగ్(17239), వైజాగ్- గుంటూరు(17240) రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.
News January 8, 2025
ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి సారించాలి: కలెక్టర్
ఫ్రీ ఓల్డ్ భూములు డేటా ఎంట్రీ, రెవెన్యూ సదస్సులలో అందిన భూసంబంధిత ఫిర్యాదులు పరిష్కారం, రీసర్వే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ మహేష్ కుమార్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర భూపరిపాలన ముఖ్య కమిషనర్ జయలక్ష్మి అమరావతి నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్, జేసీ నిశాంతి పాల్గొన్నారు.
News January 8, 2025
తూ.గో: కోడి పందేల నిర్వహణపై హైకోర్టు కీలక ఆదేశాలు
ఉభయగోదావరి జిల్లాల్లో కోడి పందేల నిర్వహణపై మంగళవారం హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పందేలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశిస్తూ న్యాయమూర్తి లక్ష్మీనరసింహ చక్రవర్తి ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో సంక్రాంతికి నిర్వహించే కోడిపందేలపై ఉత్కంఠ నెలకొంది. సంప్రదాయబద్ధంగా వస్తున్న పందేలను పూర్తిగా ఆపేయకుండా, కత్తులు కట్టకుండా నిర్వహిస్తే మంచిదని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్