News September 5, 2024

కోనసీమ: టాటా‌ఏస్ ఢీకొని రెండేళ్ల బాలుడి మృతి

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం తాడిపూడిలో టాటా‌ఏస్ వాహనం ఢీకొని రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన ఇర్లపాటి నరేష్ టెంట్ హౌస్ వ్యాపారం చేస్తాడు. గురువారం అతడి వద్ద పనిచేసే గూడపాటి బాబి ఇంటి వద్ద ఉన్న సామగ్రి తీసుకువెళ్లడానికి టాటా‌ఏస్‌పై వచ్చాడు. అక్కడ ఆడుకుంటున్న నరేష్ కుమారుడు లాస్విక్(2)ను గమనించకుండా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. SI శ్రీనివాస్ కేసు నమోదు చేశారు.

Similar News

News October 6, 2024

ఆలమూరు: గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

image

ఆలమూరు మండలం చొప్పెల్ల పంట కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైందని ఆలమూరు ఎస్సై అశోక్ ఆదివారం తెలిపారు. లాకులు దాటిన తర్వాత 40 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన మహిళ మృతదేహాన్ని గుర్తించడం జరిగిందన్నారు. పచ్చ రంగు జాకెట్, బిస్కెట్ కలర్ లంగా ధరించి ఉందన్నారు. ఎత్తు సుమారు 5.2 అడుగులు ఉంటుందని తెలిపారు. ఆమె వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News October 6, 2024

ఆత్రేయపురం: జాతీయ హ్యాండ్ బాల్ జట్టులో ప్రణీత్ వర్మ

image

జాతీస్థాయి హ్యాండ్ బాల్ జట్టులో ఆత్రేయపురానికి చెందిన ముదునూరి ప్రణీత్ వర్మకు స్థానం దక్కించుకున్నాడు. సీ.బీ.యస్.ఇ సౌత్ జోన్ రాష్ట్రాలు పాల్గొన్న హ్యాండ్ బాల్ పోటీలలో అండర్ -19 విభాగంలో అనకాపల్లి జిల్లా పాయకరావుపేట శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ తరపున ముదునూరి ప్రణీత్ వర్మ జట్టుకు ప్రథమ స్థానం లభించిందని స్కూల్ ఉపాధ్యాయులు తెలిపారు. దీంతో ప్రణీత్ వర్మను గ్రామస్థులు అభినందిస్తున్నారు.

News October 6, 2024

సముద్రంలోకి 1,62,276 క్యూసెక్కుల మిగులు జలాలు

image

రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి శనివారం సాయంత్రానికి 1,62,276 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేసినట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.90 అడుగులకు చేరిందని పేర్కొన్నారు. అలాగే డెల్టా కాలువలకు 14,000 క్యూసెక్కుల నీటిని వదిలామన్నారు.