News February 7, 2025
కోళ్ల పెంపకం దారులు అప్రమత్తంగా ఉండాలి: KMR కలెక్టర్
మహారాష్ట్ర లాతూర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రబలిస్తున్నందున కామారెడ్డి జిల్లాలోని కోళ్ల పెంపకం దారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. కలెక్టరేట్లో పశుసంవర్ధక శాఖ సిబ్బందికి ఏవియన్ ఇన్ ఫ్లూయెంజాపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. కామారెడ్డి జిల్లాకి మహారాష్ట్ర సరిహద్దున ఉన్నందున కోళ్ల పెంపకం దారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
Similar News
News February 7, 2025
అంతర్జాతీయ కోర్టుపై ట్రంప్ ఆంక్షలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుపై ఆంక్షలు విధించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ చేసి కోర్టు తన అధికారాల్ని దుర్వినియోగం చేసిందని ఆయన ఆరోపించారు. తమపై, తమ మిత్రదేశమైన ఇజ్రాయెల్‌పై నిరాధార, తప్పుడు ఆరోపణలు చేసిందని మండిపడ్డారు. కోర్టు అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబీకుల ఆస్తుల్ని ఫ్రీజ్ చేయడంతో పాటు ప్రయాణ ఆంక్షల్ని విధించారు.
News February 7, 2025
జయపురం గ్రామంలో విచారణ నిర్వహించిన ఎస్సై
నర్సింహులపేట మండలంలోని జయపురం గ్రామంలో నిన్న దళిత యువకులను గుడిలోకి రానివ్వకపోవడంతో ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో దళిత సంఘాల నాయకులు ఇచ్చిన ఫిర్యాదు చేసిన మేరకు స్థానిక ఎస్ఐ సురేశ్ గ్రామంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని ప్రజలను ఘటన గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
News February 7, 2025
సిరిసిల్ల: కుక్కల వల్ల చిన్నారికి సోకిన వైరస్
కోనరావుపేట(M) కనగర్తికి చెందిన చేపూరి శ్రీమేధ(4) అనే చిన్నారికి జ్వరంతో పాటు శరీరంపై అలర్జీ ఏర్పడింది. అవి ఎక్కువ కావడంతో చిన్నారిని సిరిసిల్లలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అన్నిరకాల పరీక్షలు చేసినా నిర్ధారణ కాకపోవడంతో 4రోజుల క్రితం HYDలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు బ్రూసెల్లా ఇథి పీకల్ వైరస్ గా గుర్తించారు. కుక్కల కారణంగా ఈ వైరస్ సోకినట్టు వైద్యులు తెలిపారు.