News March 25, 2025

క్యాన్సర్ బాధితుడి మాటలకు మంత్రి శ్రీధర్ బాబు కన్నీళ్లు

image

పలిమెల మండలం సర్వాయిపేట గ్రామానికి చెందిన నితిన్ క్యాన్సర్‌తో బాధపడుతూ HYDలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంత్రి శ్రీధర్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి తానున్నానని భరోసా కల్పించారు. ‘సార్.. నేను మంచి క్రికెటర్ కావాలనుకున్నా, క్రికెట్ కిట్ ఇప్పించండి’ అని నితిన్‌ అనడంతో శ్రీధర్ బాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. క్రికెట్ కిట్ తెప్పించి అతడి కోరికను తీర్చారు.

Similar News

News March 31, 2025

VKB: పోలీస్ స్టేషన్‌గా మారిన ఆర్డీవో ఆఫిస్

image

పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం పోలీస్ స్టేషన్గా కనిపిస్తుండడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంను పోలీస్ కార్యాలయంగా మార్చిన వెబ్ సిరీస్ షూటింగ్ నిర్వాహకులు. వికారాబాద్ ఆర్డిఓ కార్యాలయాన్ని ఆదివారం సెలవు ఉండడంతో వెబ్ సిరీస్‌కు అనుమతి ఇచ్చారు. దీంతో నిర్వాహకులు ఆర్డీవో కార్యాలయాన్ని పోలీస్ స్టేషన్‌గా మార్చి షూటింగ్ నిర్వహిస్తున్నారు.

News March 31, 2025

కుల్కచర్ల: గ్రూప్-1 అధికారిగా మోనికా రాణి

image

కుల్కచర్ల మండల కేంద్రానికి చెందిన మోనికా రాణి ఈరోజు TSPSC విడుదలైన గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్టులో రాష్ట్రస్థాయిలో 263వ ర్యాంక్, ఎస్సీ కేటగిరిలో 16వ ర్యాంకు సాధించి గ్రూప్-1 అధికారిగా ఎంపికైంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తుంది.రాష్ట్ర వ్యాప్తంగా 563 గ్రూప్-1 పొస్టులు ఉండగా మల్టి జోన్లో ఎస్సీ కేటగిరి విభాగంలో 48 పోస్టులు ఉన్నాయి.

News March 31, 2025

నేడు 38 మండలాల్లో వడగాలులు

image

AP: రాష్ట్రంలో ఇవాళ 38 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. శ్రీకాకుళం-8, విజయనగరం-9, మన్యం-10, అల్లూరి-2, తూర్పుగోదావరి-8, ఏలూరు జిల్లాలోని వేలేరుపాడులో వడగాలులు వీస్తాయని పేర్కొంది. అలాగే చింతూరు, కూనవరం మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో నిన్న ఉష్ణోగ్రతలు మండిపోయాయి. ప్రకాశం జిల్లా అమాని గుడిపాడులో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

error: Content is protected !!