News February 24, 2025
క్రికెట్ విజేతకు రూ.లక్ష అందజేత

కౌతాళంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం నిర్వహించారు. ఫైనల్లో కౌతాళం, కర్ణాటక రాష్ట్రం మాన్వి జట్లు తలపడగా.. మాన్వి జట్టు విజేతగా నిలిచింది. విజేతకు కూటమి నాయకులు సురేశ్ నాయుడు, వెంకటపతి రాజు, ఇతర నాయకులు రూ.లక్ష, రన్నర్‌గా నిలిచిన జట్టుకు రూ.50 వేలు అందజేశారు.
Similar News
News February 24, 2025
కర్నూలులో ఉ.10 గంటల నుంచి అర్జీల స్వీకరణ

కర్నూలులో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం జరగనుంది. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఉదయం 10 గంటల నుంచి కలెక్టర్ రంజిత్ బాషా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమం జిల్లా కేంద్రంతోపాటు అన్ని మండల కేంద్రాల్లోనూ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News February 23, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤ కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు ➤ ఆదోనిలో ఘోరం.. బాలుడిపైకి దూసుకెళ్లిన లారీ ➤ మంత్రాలయం శ్రీ మఠంలో ఆకట్టుకున్న భరతనాట్యం ➤ ఎమ్మిగనూరు ఎస్ఎంఎల్ కాలేజీలో 25న జాబ్ మేళా ➤ జిల్లాలో చికెన్‌కు తగ్గిన డిమాండ్ ➤ రూ.1.15 లక్షల కర్ణాటక మద్యం స్వాధీనం ➤ జిల్లాలోని ఆలయాల్లో మొదలైన మహా శివరాత్రి సందడి
News February 23, 2025
కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు

కర్నూలు జిల్లాలో 30 కేంద్రాలలో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. ఉదయం పేపర్-1 పరీక్షలకు 9,993 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 8,693 మంది, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలకు 9,993 మంది హాజరు కావాల్సి ఉండగా 8,678 మంది హాజరయ్యారని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయన్నారు.