News December 23, 2024

క్రీడాకారుల భ‌విష్య‌త్తే ప్రభుత్వానికి ముఖ్యం: శాప్ ఛైర్మన్

image

క్రీడాకారుల భ‌విష్య‌త్తే ధ్యేయంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌ని, దానికి అనుగుణంగా క్రీడా సంఘాలు, శాప్ అధికార యంత్రాంగం స‌మ‌న్వ‌యం చేసుకుని క్రీడాకారుల‌కు అన్ని విధాలుగా తోడ్పాటు నందించాల‌ని శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు ఆకాంక్షించారు. విజ‌య‌వాడ‌లోని శాప్ కార్యాల‌యంలో శాప్ అధికారుల‌కు, కోచ్‌ల‌కు క్రీడారంగంలో అమ‌లు చేయాల్సిన అంశాల‌పై సోమ‌వారం ఆయ‌న దిశానిర్ధేశం చేశారు.

Similar News

News December 25, 2024

RGVకి 15 రోజులు టైం ఇచ్చాం: జీవీ రెడ్డి

image

ఏపీ ఫైబర్‌ నెట్‌ను ప్రక్షాళన చేస్తున్నామని ఛైర్మన్‌ జీవీ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ‘గత ప్రభుత్వ హాయంలో ఫైబర్‌ నెట్‌ నుంచి ఆర్జీవీకి అక్రమంగా డబ్బు చెల్లించారు. డబ్బు తిరిగి చెల్లించేందుకు ఆయనకు 15 రోజుల సమయం ఇచ్చాం. గడువులోగా డబ్బు చెల్లించకుంటే ఆర్జీవీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. గత ప్రభుత్వం నియమించిన 410 మందిని తొలగిస్తాం’ అని తెలిపారు.

News December 25, 2024

జాతీయ షూటింగ్ పోటీలకు క‌‌ృష్ణ జిల్లా క్రీడాకారులు

image

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని హౌరా పట్టణంలో జరగబోయే 43వ జాతీయ షూటింగ్ బాల్ పోటీలకు కృష్ణాజిల్లా బాల బాలికలు ఎంపికైనట్లు జిల్లా షూటింగ్ బాల్ సంఘం అధ్యక్షుడు అట్లూరి రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం వారిని ఆంధ్రప్రదేశ్ షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కురువ పరశురాముడు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోటీలు డిసెంబర్ 27న తేదీ నుంచి 29 వరకు జరుగుతాయన్నారు.

News December 24, 2024

కృష్ణ: కారు ఢీ కొని.. ప్రభుత్వ టీచర్ దుర్మరణం

image

మండలంలోని పెడసనగల్లు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వి.రామకృష్ణను సోమవారం కంకిపాడు టోల్ ప్లాజా వద్ద కారు ఢీ కొట్టింది. గాయాలపాలైన ఆయనను సిటీ న్యూరో సెంటర్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స అందుతుండగా ఆయన మంగళవారం మరణించారని మొవ్వ మండల ఏపీ టీచర్స్ ఫెడరేషన్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. పాఠశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.