News April 8, 2025
క్షయ వ్యాధి నివారణపై అవగాహన కల్పించాలి: DMHO

రఘునాథపాలెం: క్షయ వ్యాధి నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని డిఎంహెచ్వో డా. కళావతి బాయ్ అన్నారు. జిల్లాలో పని చేస్తున్న మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లకు విధి నిర్వహణ పై జిల్లా కలెక్టరేట్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలలో అవగాహన పెంచాలన్నారు.
Similar News
News April 19, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓:రఘునాథపాలెంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన ✓: కూసుమంచిలో భూభారతిపై అవగాహన కార్యక్రమం ✓: తల్లాడలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ✓:ఏన్కూర్: వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ✓:జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ✓: కారేపల్లిలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ✓: పలు శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం ✓: ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
News April 19, 2025
NKP: భూ భారతి చట్టంతో భూ సమస్యలు వేగంగా పరిష్కారం

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని, గ్రామాల్లో చేపడుతున్న రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తు చేసుకోవాలని ఇంచార్జ్ కలెక్టర్ డా. పి. శ్రీజ తెలిపారు. నేలకొండపల్లి మండలం చెరువు మాధారం, కొత్త కొత్తూరు గ్రామాలలో చేపట్టిన రెవెన్యూ సదస్సులను ఇంచార్జ్ కలెక్టర్ తనిఖీలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు ఉన్నారు.
News April 19, 2025
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలను సహించం: మంత్రి పొంగులేటి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకంలో అవకతవకలకు పాల్పడే ఎలాంటి వారినైనా ఉపేక్షించమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల విషయంలో అక్రమాలకు పాల్పడితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బేస్మెంట్ నిర్మాణం పూర్తి కాకుండానే తప్పుడు సమాచారాన్ని అప్ లోడ్ చేసిన బిల్ కలెక్టర్ జగదీష్‌పై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.