News March 17, 2025

ఖమ్మం: BC గురుకుల విద్యాలయాల్లో దరఖాస్తుల ఆహ్వానం

image

బీసీ గురుకుల విద్యాలయాల్లో 2025-2026 విద్యా సంవత్సరానికి గానూ 6, 7, 8, 9వ తరగతి (ఇంగ్లిషు మీడియం)లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ సీట్లకు ప్రవేశం కొరకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా బీ.సీ గురుకుల ఆర్సీఓ సి.హెచ్. రాంబాబు తెలిపారు. ఆసక్తిగల బాల-బాలికలు 150 రూపాయల రుసుముతో ఈ 31లోగా https://mjptbcadmissions .org/ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

Similar News

News March 18, 2025

నాగన్ పల్లి పసుపు వాగులో గుర్తుతెలియని వ్యక్తి శవం

image

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం నాగన్ పల్లి శివారులో గల పసుపు వాగులో సుమారు 40 నుంచి 50 ఏళ్ల వయసు గల మగ వ్యక్తి శవం లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు బోధన్ రూరల్ ఎస్సై మచ్చందర్ రెడ్డి వెల్లడించారు. మృతుడిని ఎవరైనా గుర్తించినట్లయితే బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు.

News March 18, 2025

ఖమ్మం: అండర్ పాస్‌కు రైల్వే మంత్రి హామీ

image

ఖమ్మం నగరంలోని రైల్వే మధ్య గేటు సమస్యకు శాశ్వత పరిష్కారానికి హామీ లభించింది. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సోమవారం పార్లమెంటులో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిశారు. మధ్య గేటు ప్రాధాన్యత, వ్యాపార, వాణిజ్య సంబంధాలు తదితర అంశాలపై ఆయన రైల్వే మంత్రికి వివరించారు. స్పందించిన మంత్రి మధ్య గేటు వద్ద అండర్ పాస్ నిర్మాణం పై సాధ్యసాధ్యాలను పరిశీలించాలని రైల్వే ఉన్నతాధికారులకు సూచించారు.

News March 18, 2025

GOVT జాబ్ కొట్టిన నల్గొండ అమ్మాయి 

image

టీజీపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1,2 ఫలితాల్లో నల్గొండ జిల్లా త్రిపురారం మండలం వస్త్రాంతండా పరిధిలోని నడిపి తండాకు చెందిన మేఘావత్ కవిత రాష్ట్ర స్థాయిలో 329 ర్యాంకు సాధించి ఉద్యోగానికి ఎంపికైంది. కొంతకాలంగా ఎటువంటి కోచింగ్ లేకుండా స్వతహాగా ప్రిపేరై ఉద్యోగం సాధించిన కవిత ప్రైమరీ నుంచి హై స్కూల్ వరకు ఇబ్రహీంపట్నంలోని గిరిజన గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసించారు.

error: Content is protected !!