News April 22, 2025

ఖమ్మం: ఇంటర్ ఫలితాల్లో కృష్ణవేణి ప్రతిభ

image

ఇంటర్ ఫలితాల్లో ఖమ్మంలోని కృష్ణవేణి జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. సెకండియర్‌లో హాసిని 994, ప్రియాంబిక 993, సంతోశ్ 991, జ్యోత్స్న 994, నవ్యశ్రీ 988, ఫస్టియర్‌లో భువనకృతి 468, పవిత్ర 468, హర్షిత్ 467, ప్రహర్ష 437, కరుణశ్రీ 437 ఉత్తమ రిజల్ట్ సాధించారని డైరెక్టర్ జగదీశ్ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల తోడ్పాటుతోనే ఈ ఫలితాలు సాధించగలిగామని డైరెక్టర్ యార్లగడ్డ వెంకటేశ్వర రావు తెలిపారు.

Similar News

News April 23, 2025

27న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు: ఖమ్మం DEO

image

తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు ఈ నెల 27న (ఆదివారం) నాడు నిర్వహిస్తున్నట్లు DEO సోమశేఖర్ వర్మ తెలిపారు. 6వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7-10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించబడతాయని చెప్పారు. పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షా పత్రాల లీకేజీ వదంతులు నమ్మవద్దని సూచించారు.

News April 23, 2025

ఖమ్మం: కేయూ పీజీ పరీక్షలు వాయిదా

image

ఈనెల 26న ప్రారంభం కావాల్సిన వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ (రెగ్యులర్) 4వ సెమిస్టర్ పరీక్షలు జూన్ 6కు వాయిదా పడ్డాయి. మే 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులను ప్రకటించిన నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడ్డాయని రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 23 నుంచి 30 వరకు ప్రయోగ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

News April 23, 2025

ఖమ్మం: సివిల్స్‌లో 231వ ర్యాంకు సాధించిన చరణ్ తేజ

image

ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి నామవరం గ్రామానికి చెందిన నర్సింశెట్టి చరణ్ తేజ దేశవ్యాప్తంగా విడుదలైన సివిల్స్ పరీక్షలో 231వ ర్యాంకు సాధించారు. ఈ విజయంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చరణ్ తేజ సాధించిన విజయం యువతకు ఆదర్శంగా నిలుస్తుందని గ్రామస్థులు ప్రశంసించారు.

error: Content is protected !!