News May 1, 2024
ఖమ్మం: ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని పోస్ట్ కార్డు రాశాం:పొంగులేటి
మాజీ సీఎం ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని తాను, ఖమ్మం కాంగ్రెస్ MP అభ్యర్థి రఘురాంరెడ్డి కేంద్రానికి పోస్ట్ కార్డు రాశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. మాజీ సీఎంలు ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో ఎప్పుడు జీవించే ఉంటారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు తమ్ముళ్లు మద్దత్తు ఇచ్చారని ఇప్పుడు కూడా ఇవ్వాలన్నారు.
Similar News
News November 27, 2024
రూ.100 కోట్లు తిరిగి ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం: ఎమ్మెల్యే కూనంనేని
అదానీ ఇచ్చిన రూ.100 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఇస్తామనడాన్ని స్వాగతిస్తున్నామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. దీంతోపాటు అదానీ చేసుకున్న ఒప్పందాలలో ఏమైనా అవినీతి జరిగిందా అనే కోణాన్ని కూడా ప్రభుత్వం బయట పెట్టాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
News November 26, 2024
కొత్తగూడెం ఎయిర్పోర్డుపై కేంద్ర మంత్రి కీలక ప్రకటన
తెలంగాణలో విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. కొత్తగూడెం విమానాశ్రయ ఏర్పాటుకు అనువైన స్థలం ఉందని సీఎం తమ దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. త్వరలోనే కొత్తగూడేనికి సాంకేతిక బృందాన్ని పంపించనున్నట్లు చెప్పారు. కొత్తగూడెంతో పాటు వరంగల్ విమానాశ్రయాన్ని కూడా ఏర్పాటు చేసే సంకల్పంతో ఉన్నట్లు చెప్పారు.
News November 26, 2024
‘ఉచిత కోచింగ్ కోసం ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలి’
విదేశాలకు వెళ్లి చదవాలనుకునే మైనార్టీ విద్యార్థుల కోసం IELTS, GRE, TOFEL పరీక్షలకు తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ HYD ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కె.సత్యనారాయణ తెలిపారు. ఆసక్తి, అర్హత గల జిల్లా మైనార్టీ అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈనెల 30 లోపు తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ HYD లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.