News April 15, 2024
ఖమ్మం: ఓటు నమోదుకు నేటితో ముగియనున్న గడువు
ఓటు హక్కును నమోదు చేసుకునేందుకు నేటితో గడువు ముగియనుంది. ఏప్రిల్ 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండినవారు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. కొత్తగా నమోదు చేసుకునేవారు మే నెల 13న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశముంది. ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News November 26, 2024
ఇవాళ, రేపు ప్రజా విజయోత్సవాలు: జిల్లా కలెక్టర్
ఇవాళ, రేపు రెండు రోజుల పాటు ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమాలు నిర్వహిస్తామని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో, ఎల్లుండి ఖమ్మం రూరల్ మద్ది ఎల్లారెడ్డి ఫంక్షన్ హాలులో జయ జయహే ప్రజా పాలన అనే కళాబృందం అలేఖ్య సారథ్యంలో కార్యక్రమం నిర్వహిస్తమని చెప్పారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
News November 25, 2024
ఖమ్మం జిల్లాలో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు కృషి : తుమ్మల
ఖమ్మం జిల్లాలో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మంలో వన సమారాధన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటైతే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి వినతి పత్రం సమర్పించినట్లు గుర్తు చేశారు.
News November 25, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి ముఖ్యాంశాలు
∆} భద్రాద్రి జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన ∆} మధిరలో ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమం ∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} బూర్గంపాడులో ఎమ్మెల్యే పాయం పర్యటన ∆} అన్నపురెడ్డిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు ∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన