News March 28, 2024

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటనకు ఆలస్యం ఏంటి..?

image

ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటనపై ఉత్కంఠ కొనసాగుతుంది. నిన్న జరిగిన సీఈసీ సమావేశంలో ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తారని అందరూ భావించిన అది జరగలేదు. అభ్యర్థి ప్రకటనపై ఎందుకు ఆలస్యం జరుగుతుందో అర్థం కాకుండా ఉందని స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే BRS, BJP అభ్యర్థులను ప్రకటించడంతో ప్రచారంలో వారు నిమగ్నమయ్యారని, త్వరగా అభ్యర్థిని ప్రకటించాలని కోరుతున్నారు.

Similar News

News October 4, 2024

ఖమ్మం: దసరా సందర్భంగా క్రేజీ ఆఫర్

image

దసరా సందర్భంగా నేలకొండపల్లిలో యువకులు విచిత్రమైన బంపర్ ఆఫర్ ఏర్పాటు చేశారు. వంద రూపాయలు పెట్టి కూపన్ కొనుగోలు చేస్తే మొదటి బహుమతి 10కిలోల మేక, రెండు, మూడు, నాలుగు బహుమతులు మద్యం బాటిళ్లు, నాటు కోళ్లు లక్కీ డ్రా ద్వారా అందించనున్నట్లు యువకులు పేర్కొన్నారు. ఈ నెల 10న నేలకొండపల్లిలో లక్కీ డ్రా ఉంటుందని తెలిపారు. ఈ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

News October 4, 2024

ఖమ్మం: ప్రతి హాస్టల్ విద్యార్ధులతో ఫుడ్ కమిటీ ఏర్పాటు: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లాలో ఉన్న గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ళ నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రతి హాస్టల్లో విద్యార్థులతో ఫుడ్ కమిటీ ఏర్పాటు చేయాలని, ఆహార పదార్థాల డెలివరీ, స్టోరేజిలో వీరిని భాగస్వామ్యం చేయాలన్నారు.

News October 3, 2024

ఖమ్మం: డయల్-100కు ఎన్ని కాల్స్ వచ్చాయంటే.?

image

సమాజంలో పెరిగిపోతున్న నేర ప్రవృత్తి నేపథ్యంలో ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణే ధ్యేయంగా ఏర్పాటైన డయల్-100కు పోలీస్ కమిషనరేట్ పరిధిలో 5,511 కాల్స్ వచ్చినట్లు CP సునీల్ దత్ తెలిపారు. వీటిపై 81 FIRలు నమోదు చేశామని, వీటిలో మహిళలపై వేధింపులు-2, దొంగతనాలు-9, సాధారణ ఘాతాలు-26, యాక్సిడెంట్లు-11, అనుమానాస్పద మరణాలు-10, ఇతర కేసులు-23 అన్నారు. ఫేక్ కాల్స్ చేయవద్దని, అత్యవసర సమయంలో మాత్రమే ఫోన్ చేయాలన్నారు.