News April 24, 2024
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఈయనే..!

ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురామ్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు సోమవారం బెంగళూరులో డీకే శివకుమార్, మల్లికార్జున్ ఖర్గేతో జరిగిన సమావేశంలో మంత్రులు భట్టి, పొంగులేటికి ఈ విషయం మీద స్పష్టత ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అభిప్రాయభేదాలకు తావు లేకుండా, పార్టీకి నష్టం జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
Similar News
News April 23, 2025
ఖమ్మం: సివిల్స్‌లో 231వ ర్యాంకు సాధించిన చరణ్ తేజ

ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి నామవరం గ్రామానికి చెందిన నర్సింశెట్టి చరణ్ తేజ దేశవ్యాప్తంగా విడుదలైన సివిల్స్ పరీక్షలో 231వ ర్యాంకు సాధించారు. ఈ విజయంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చరణ్ తేజ సాధించిన విజయం యువతకు ఆదర్శంగా నిలుస్తుందని గ్రామస్థులు ప్రశంసించారు.
News April 23, 2025
KMM: ఫెయిల్ అయ్యామని ఆందోళన చెందొద్దు: DEO

జీవితంలో ఎన్నో అవకాశాలు వస్తాయని, కేవలం పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని DEO సోమశేఖర్ వర్మ అన్నారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఈనెల 23 నుంచి 30 వరకు పరీక్ష ఫీజును పట్టించుకోవడం జరుగుతుందని చెప్పారు. ఫెయిల్ అయ్యామని ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, తల్లిదండ్రులు తమ పిల్లల మానసిక పరిస్థితిని గమనించి సరైన సూచనలు ఇవ్వాలని కోరారు.
News April 22, 2025
ఖమ్మం: ఇంటర్ ఫలితాల్లో కృష్ణవేణి ప్రతిభ

ఇంటర్ ఫలితాల్లో ఖమ్మంలోని కృష్ణవేణి జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. సెకండియర్‌లో హాసిని 994, ప్రియాంబిక 993, సంతోశ్ 991, జ్యోత్స్న 994, నవ్యశ్రీ 988, ఫస్టియర్‌లో భువనకృతి 468, పవిత్ర 468, హర్షిత్ 467, ప్రహర్ష 437, కరుణశ్రీ 437 ఉత్తమ రిజల్ట్ సాధించారని డైరెక్టర్ జగదీశ్ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల తోడ్పాటుతోనే ఈ ఫలితాలు సాధించగలిగామని డైరెక్టర్ యార్లగడ్డ వెంకటేశ్వర రావు తెలిపారు.