News February 21, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

√ పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
√ మధిరలో విద్యుత్ సరఫరాల అంతరాయం
√ కొనిజర్ల మండలంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
√ అమ్మపాలెం లో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు
√ సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద పర్యటన
√ మధిరలో కొనసాగుతున్న కుల గణన సర్వే
√ ఖమ్మం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

Similar News

News February 22, 2025

ఖమ్మంలో పుష్ప నటుడు జగదీశ్ (కేశవ) సందడి

image

ఖమ్మంలో శనివారం పుష్ప మూవీ నటుడు జగదీశ్ (కేశవ) సందడి చేశారు.  బోనకల్ క్రాస్ రోడ్‌లో ఓ షాప్ ఓపెనింగ్‌కు వచ్చిన ఆయనను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో పలువురు సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు. నటుడు జగదీశ్ ‘తగ్గేదేలే’ అంటూ అభిమానులను అలరించారు.

News February 22, 2025

తల్లాడ ఘోర రోడ్డు ప్రమాదం.. ఆప్డేట్

image

తల్లాడ మండలం రంగంబంజరలో<< 15531420>> రోడ్డు ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. పెనుబల్లి మండలం ముత్తగూడెంకి చెందిన నాగిరెడ్డి టీవీఎస్‌పై తల్లాడ మం.నారాయణపురంలో తన అక్కను చూసేందుకు వచ్చాడు. తిరిగి వెళ్తుండగా రంగంబంజర వద్ద వెనక నుంచి కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగిరెడ్డి టైర్ల కిందపడి మృతి చెందాడు. కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SHO వెంకటేశ్వర్లు తెలిపారు.

News February 22, 2025

శ్రీచైతన్యలో ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. కారణమిదే..!

image

ఖమ్మం శ్రీచైతన్యలో ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఎటపాకకు చెందిన యోగా నందిని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. సంక్రాంతి సెలవులకు వెళ్లి చాలా రోజుల తరువాత వచ్చినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం క్లాస్‌లకు వెళ్లిన నందిని ఆరోగ్యం బాగలేదని మధ్యలోనే హస్టల్‌కి వెళ్లింది. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో హస్టల్ సిబ్బంది వెళ్లి చూడగా బలవన్మరణానికి పాల్పడింది.

error: Content is protected !!