News March 3, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం ∆} సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} పైనంపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు ∆} వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
Similar News
News March 4, 2025
ఖమ్మం: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం నగరంలోని మహిళా ప్రాంగణంలో వివిధ కోర్సులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు మహిళా ప్రాంగణం అధికారి వేల్పుల విజేత తెలియజేశారు. 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్న మహిళలు ఈనెల పదో తేదీలోగా ఖమ్మంలోని మహిళా ప్రాంగణంలో దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు. మరిన్ని వివరాలకు టేకులపల్లిలో ఉన్న మహిళా ప్రాంగణం కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
News March 4, 2025
ప్రజా అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

రఘునాథపాలెం: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఆయా శాఖలకు వచ్చిన అర్జీలను మరొకమారు పరిశీలన చేసి, పెండింగ్ లో లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు.
News March 3, 2025
ఖమ్మం: శ్రీపాల్ రెడ్డి నేపథ్యం ఇదే..!

వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ MLCగా విజయం సాధించిన పింగళి శ్రీపాల్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా గూడూరులో జన్మించారు. ఆయనకు 52 ఏళ్లు. వృత్తి రీత్యా హనుమకొండలో స్థిరపడ్డారు. ఆయన గతంలో PRTU TS, UTF రాష్ట్ర అధ్యక్షుడిగా, అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(AIFTO) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేశారు. 2021లో జాతీయ ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు. కాగా ఇటీవల ఆయన తన టీచర్ పోస్ట్‌కు రాజీనామా చేశారు.