News March 24, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం ∆} వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ∆} మధిర మండలంలో విద్యుత్ సరఫరాల అంతరాయం ∆} పెనుబల్లి మండలంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ∆} ఏన్కూర్ వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం ∆} పైనంపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
Similar News
News March 29, 2025
ఖమ్మం: మిషన్ భగీరథ ఎస్ఈగా శేఖర్ రెడ్డి బాధ్యతలు

మిషన్ భగీరథ ఎస్ఈగా జి.శేఖర్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌ను ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
News March 28, 2025
ప్రణాళికాబద్ధంగా ప్యాక్స్ పని చేయాలి: ఖమ్మం కలెక్టర్

ప్రణాళికాబద్ధంగా ప్యాక్స్ పని చేయాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ప్యాక్స్‌లో ఉన్న సభ్యులు యాక్టివ్‌గా ఉండేలా చూడాలని చెప్పారు. అటు ప్యాక్స్ రైతులకు ఉపయోగపడే నూతన కార్యక్రమాలను చేపట్టేలా ప్రణాళిక చేయాలన్నారు.
News March 28, 2025
రైల్వేబోర్డు చైర్మన్‌ను కలిసిన ఖమ్మం ఎంపీ

ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి రైల్వే బోర్డు ఛైర్మన్ సతీష్ కుమార్‌ను ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డోర్నకల్- మిర్యాలగూడ, డోర్నకల్- గద్వాల రైల్వే లైన్ అలైన్మెంట్ గురించి వివరించారు. పలు సమస్యలు, సూచనలు తెలపగా రైల్వే బోర్డు ఛైర్మన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.