News February 4, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ముత్తారం రామాలయంలో రథసప్తమి వేడుకలు
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} సత్తుపల్లిలో కాంగ్రెస్ నేత దయానంద్ పర్యటన
∆} కారేపల్లి రైల్వే గేట్ మూసివేత
∆} ఏన్కూర్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
Similar News
News February 4, 2025
బోనకల్‌లో సినీ నిర్మాత కేపీ.చౌదరి అంత్యక్రియలు
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రాయన్నపేట గ్రామానికి చెందిన సినీ నిర్మాత కేపీ.చౌదరి సోమవారం ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేక గోవాలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన మృతదేహాన్ని ఈరోజు సాయంత్రం స్వస్థలమైన రాయన్నపేట గ్రామానికి తీసుకురానున్నారు. స్వగ్రామంలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.
News February 4, 2025
పతనమవుతున్న ఎర్ర బంగారం ధర
ఖమ్మం మార్కెట్‌లో ఎర్ర బంగారం (తేజ రకం) ధర రోజురోజుకూ పతనమవుతుంది. గత ఏడాది రూ. 23 వేలు పలకగా.. ప్రస్తుతం రూ. 14 వేలకు పడిపోయింది. చైనా దేశంతో పాటు కర్ణాటకలో పండిన పంట వల్ల ఇక్కడి ధరలపై ప్రభావం పడుతోంది. గతేడాది పంట నిల్వ చేసి నష్టపోయిన వ్యాపారులు ప్రస్తుతం మిరపను కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. ధరలు భారీగా తగ్గడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
News February 4, 2025
రెండు రోజుల వ్యవధిలో భార్య భర్తలు మృతి
కల్లూరు మండల పరిధిలోని లింగాల గ్రామ మాజీసర్పంచ్ మట్టూరి సీతారత్నం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. రెండు రోజుల క్రితం ఈమె భర్త మట్టూరి భద్రయ్య మృతి చెందాడు. రెండురోజుల వ్యవధిలో భార్య భర్తలు మృతి చెందడంతో లింగాల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.