News April 24, 2025
ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తప్పని నీటి కష్టాలు

ఎండల తీవ్రత పెరుగుతుండడంతో ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి నీటి కష్టాలు పొంచి ఉన్నాయి. ఓ పక్క భూగర్భ జలాలు అడుగంటడం, మరో పక్క మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రోజు విడిచి రోజు నీటి సరఫరాతో కష్టాలు తప్పేలా లేవు. అంతేకాక బోర్ల ద్వారా కూడా సరఫరా తగ్గిపోతుండటంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో ఈ ఏడాది నీళ్ల ముప్పు ఎదురుకానుంది. ఖమ్మం నగరంలో మంచినీటి సరఫరాకు ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
Similar News
News April 25, 2025
NRML: భార్య ఇంట్లోంచి వెళ్లిపోయిందని భర్త సూసైడ్

కుభీర్ మండలం అంతర్నీ గ్రామానికి చెందిన సురేశ్(32) మిషన్ భగీరథ సంపులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. సురేశ్ అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహం చేసుకొని ఇల్లరికం ఉంటున్నాడు. ఈనెల 22న భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భార్య వాళ్ల అక్క ఇంటికి వెళ్లిపోయింది. భార్య ఇంట్లోంచి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన సురేశ్ మిషన్ భగీరథ సంపులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
News April 25, 2025
BHPL: మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌తో రివ్యూ మీటింగ్

భూపాలపల్లి ఐడీవోసీలో సరస్వతి పుష్కరాల గూరించి గురువారం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌తో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. పుష్కరాల కొరకు అవసరమైన డాక్టర్స్, స్టాప్, క్యాంపుల గురించి చర్చించారు. DMHO డా.మధుసూదన్ మాట్లాడుతూ.. మెయిన్ క్యాంప్ కాళేశ్వరంలో ఆర్థోపెడిక్ డాక్టర్, అనేస్తీసియా డాక్టర్, జనరల్ మెడిసిన్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్ కావాలని సూచించారు.
News April 25, 2025
కలెక్షన్ల సంభవం.. 2 వారాల్లో రూ.172 కోట్లు!

హీరో అజిత్ నటించిన మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ థియేటర్లలో కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. తమిళనాడులో విడుదలైన రెండు వారాల్లోనే రూ.172.3 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరించింది.