News February 27, 2025

ఖమ్మం: మద్యం అమ్మకాలు ఢమాల్!

image

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లిక్కర్ విక్రయాలు పడిపోతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో రూ. 75 కోట్ల అమ్మకాలు జరగగా, ప్రస్తుత ఫిబ్రవరిలో రూ.65 కోట్ల సేల్స్ జరిగాయి. ఏపీలో కొత్త మద్యం పాలసీ రావడంతో సత్తుపల్లి, మధిర, వైరా, ఖమ్మం, అశ్వారావుపేట ఎక్సై‌జ్ సర్కిళ్లలో ప్రభావం పడింది. పెరిగిన బీర్ల ధరలతో అమ్మకాలు మరింత క్షీణించవచ్చనే అభిప్రాయాలున్నాయి.

Similar News

News February 27, 2025

ఖమ్మం: ‘24 గంటలు సైలెన్స్ పీరియడ్ అమలు’

image

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 24 గంటలపాటు సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఈ సమయంలో సభలు, సమావేశాలు, రాజకీయ పరమైన సంక్షిప్త సందేశాలు పంపడంపై నిషేధం విధించినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే సందేశాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News February 27, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం జిల్లాలో నేడు ఎమ్మెల్సీ ఎన్నికలు ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన ∆} ఖమ్మం జిల్లాలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పర్యటన ∆} వైరా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం నగరంలో ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి పర్యటన ∆} ఏన్కూర్ వ్యవసాయ మార్కెట్ మార్కెట్‌కు సెలవు ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద పర్యటన.

News February 27, 2025

ఖమ్మం: నేడే పోలింగ్.. అంతా రెడీ!

image

నేడు జరగనున్న NLG, KMM, WGL టీచర్ MLC ఎన్నికల పోలింగ్‌కు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధికార యంత్రాంగం సన్నద్ధమయ్యాయి. 6,111 మంది ఓటర్లకు 47 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా BNS యాక్ట్ అమలు చేస్తున్నారు. భద్రతా రీత్యా సమస్యలు ఉంటే 100కు ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు. బరిలో 19 మంది ఉండగా.. ఎవరు విజేతగా నిలుస్తారో మార్చి 3వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే.

error: Content is protected !!