News April 25, 2025
ఖమ్మం మిర్చి నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్.!

ఖమ్మంలో పండించే తేజ మిర్చికి అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతోంది. ఇతర రకాలతో పోలిస్తే ఖమ్మం తేజ మిర్చి ఘాటు ఎక్కువ కావడంతో ఇక్కడి నుంచే కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి పౌడర్, నూనెను విదేశాల్లో భారీగా ఉపయోగించడం వల్ల డిమాండ్ పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. అటు మార్కెట్‌లోనూ మిర్చి పోటెత్తుతోంది. కానీ ధరలు మాత్రం పెరగడం లేదని, ఉన్నతాధికారులు దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.
Similar News
News April 25, 2025
చిత్తూరు: రోడ్ల మరమ్మతుకు నిధుల మంజూరు

రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఆర్అండ్ బీ ఈఈ శ్రీనివాసులు తెలిపారు. చిత్తూరులో ఎంఎస్ఆర్ సర్కిల్ నుంచి పలమనేరు రోడ్డు, ఇరువారం మీదుగా బైపాస్ వరకు 5 కిలోమీటర్ల లేయర్‌కు రూ.2.50 కోట్లు, పలమనేరు-గుడియాత్తం రోడ్డు(3 కిలోమీటర్లు)కు రూ.1.80 కోట్లు, బైరెడ్డిపల్లె-పుంగనూరు రోడ్డు(6 కిలోమీటర్లు)కు రూ.4.50 కోట్లు విడుదల అయ్యాయి. త్వరలో టెండర్లు పిలవనున్నట్లు ఆయన తెలిపారు.
News April 25, 2025
‘అమ్మా, నాన్నా.. నాకు బతకాలని లేదు’

అంటూ ఏడాది బాబు ఉన్న తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలిచివేస్తోంది. TG జగిత్యాల జిల్లాకు చెందిన ప్రసన్నలక్ష్మి(28), తిరుపతికి 2023లో వివాహమైంది. ఇద్దరూ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నారు. ఏడాది కిందట బాబు పుట్టడంతో ప్రసన్న ఉద్యోగం మానేసింది. దీంతో భర్త, అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధించారు. ఈక్రమంలోనే ఇటీవల పుట్టింటికి వచ్చిన ప్రసన్న అద్దంపై సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది.
News April 25, 2025
చీరాల ఛైర్మన్ పీఠంపై ఉత్కంఠ!

ఉమ్మడి ప్రకాశం(D)లో రాజకీయంగా కీలక స్థానమైన చీరాలలో పాలిటిక్స్ వేడెక్కాయి. మున్సిపల్ ఛైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారు. దీంతో తదుపరి ఛైర్మన్ ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. పొత్తూరి సుబ్బయ్య, మించాల సాంబశివరావు, సూరగాని లక్ష్మి తదితరులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు చర్చ నడుస్తోంది. కొద్ది రోజుల్లో ఈ ఉత్కంఠకు తెర పడనుంది.