News March 22, 2025
ఖమ్మం: రామయ్య తలంబ్రాలకు విశేష స్పందన: ATM రామారావు

ఈనెల 15 న ఆర్టీసీ MD సజ్జనార్ చేతుల మీదుగా ప్రారంభించిన సీతరాముల కళ్యాణ తలంబ్రాల బుకింగ్స్ కు విశేష స్పందన లభిస్తుందని ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల కార్గో ATM రామారావు తెలిపారు. ప్రారంభించిన వారం రోజుల్లోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు 300 బుకింగ్స్ అయినట్లు తెలిపారు. సీతారాముల తలంబ్రాలు కావాల్సినవారు 151 రూపాయి చెల్లించి బుకింగ్ చేసుకున్న వారికి ఇంటి వద్దకే చేరుస్తామన్నారు.
Similar News
News March 25, 2025
ఖమ్మం: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నేలకొండపల్లి మండలంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నాచేపల్లికి చెందిన D.హరీశ్ అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 3 రోజులుగా ఇంట్లోంచి ఎవరు బయటకు రాకపోవడంతో ఇంట్లోంచి దుర్వాసన రావడంతో అటుగా వెళుతున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 25, 2025
యువకుడి ప్రాణాలు తీసిన డేటింగ్ యాప్

మణుగూరు మండలంలో సోమవారం<<15868447>> ఉరివేసుకుని యువకుడు<<>> ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. వాసవీనగర్కి చెందిన సుగ్గుల కార్తీక్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. డేటింగ్ ఫ్రెండ్ యాప్లో ఓ యువతితో పరిచయం పెంచుకుని ప్రేమించాడు. చివరకు ఆమె అతడి ప్రేమను నిరాకరించడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. తండ్రి సుదర్శన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 25, 2025
ఖమ్మం: మహిళల కోసం రేపు జాబ్ మేళా..

ఖమ్మంలోని నిరుద్యోగ మహిళలకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించుటకు ఈనెల 26న బుధవారం ఉదయం 10 గంటలకు తనికెళ్ల తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి ఎన్.మాధవి తెలిపారు. దాదాపు 1,370 ఉద్యోగ ఖాళీల భర్తీకి గానూ 18-30 సంవత్సరాల వయస్సు గల డిగ్రీ పాసైన మహిళలు అర్హులని, వారికి వేతనం రూ.12వేల నుంచి రూ.18వేల వరకు ఉంటుందని అన్నారు