News March 26, 2025

ఖమ్మం: రూ.250 కోట్లతో మరో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ

image

ఖమ్మంలో తొలి ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వేంసూరు మండలం కల్లూరిగూడెంలో రూ.250 కోట్లతో, 48 ఎకరాల్లో ఫ్యాక్టరీ నిర్మించనుండగా, ఈ ఉగాదికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో ఒక ఫ్యాక్టరీ ఉండగా, మరొకటి వేంసూరులో నిర్మిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 1.10లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతుండటం గమనార్హం.

Similar News

News April 1, 2025

ఖమ్మం: కోట మైసమ్మ తల్లిని దర్శించుకున్న అసిస్టెంట్ కమిషనర్

image

కామేపల్లి మండలం కొత్తలింగాల కోటమై సమ్మ దేవాలయంలో అమ్మవారిని ఖమ్మం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వీర స్వామి సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిషనర్‌కు ఈవో నల్లమోతు శేషయ్య, జూనియర్ అసిస్టెంట్ బి.వరప్రసాద్, అర్చకులు బాచి మంచి పుల్లయ్య శర్మ సాంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. భక్తులు, గ్రామస్థులు విరివిగా పాల్గొన్నారు.

News March 31, 2025

KMM: రంజాన్ వేడుకల్లో డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!

image

ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని ముస్లిం కాలనీలో గల మైనార్టీ సెల్ నాయకుడు షేక్ గౌస్‌ ఉద్దీన్ నివాసంలో జరిగిన రంజాన్ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర డీప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరీ సోదరీమణులకు భట్టి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

News March 31, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆}ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ∆} ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} పెనుబల్లి నీలాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పర్యటన 

error: Content is protected !!