News April 21, 2024
ఖమ్మం: రూ.48,63,300 విలువైన సొత్తు స్వాధీనం

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి శనివారం వరకు 517మందిపై 471 కేసులు నమోదు చేసి.. రూ.48,63,300 విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వ్యయ పరిశీలన సెల్ నోడల్ అధికారి మురళీధర్‌రావు తెలిపారు. 40 కేసుల్లో బాధ్యులు ఆధారాలను సమర్పించడంతో తిరిగి ఇచ్చామన్నారు. ఇవి కాకుండా రూ.3.50లక్షల విలువైన పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకుని 4 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.
Similar News
News April 22, 2025
జిల్లాలో ముమ్మరంగా ధాన్యం కనుగొళ్లు

ఖమ్మం జిల్లాలో యాసంగి ధాన్యం కనుగొళ్లు ముమ్మరంగా సాగుతున్నట్లు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి చందన్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 385 రైతులకు రూ.1.45 కోట్లను చెల్లించినట్లు వెల్లడించారు. 29,056 క్వింటాళ్ల సన్నధాన్యానికి బోనస్ చెల్లించామన్నారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద అమ్మకాలు జరిపి మద్దతు ధర, బోనస్ పోందాలని ఆయన కోరారు.
News April 22, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!!

∆} ఖమ్మంలో ఎంపీ రఘురాం రెడ్డి పర్యటన ∆} ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న ఓపెన్ 10, ఇంటర్ పరీక్షలు ∆} ముదిగొండలో భూభారతిపై అవగాహన కార్యక్రమం ∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన ∆} తల్లాడలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} మధిర ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
News April 22, 2025
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 694 మందిపై కేసు నమోదు

ఖమ్మం: డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన 673 మందితో పాటు 21 మంది మైనర్లపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఈ నెలలోని 20 రోజుల్లో ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని చెప్పారు. మద్యం సేవించి వాహనాల నడుపుతూ పట్టుపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.