News February 1, 2025
ఖమ్మం: వన మహోత్సవం @ లక్ష మొక్కలు
వన మహోత్సవం 2025-26లో భాగంగా కేఎంసీలో మొక్కలను సిద్ధం చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది. శుక్రవారం ఖమ్మం నగరంలోని గొల్లగూడెంలో ఏర్పాటు చేసిన నర్సరీని కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య ప్రారంభించారు. లక్ష మొక్కలు పెంచేందుకు పనులను ముమ్మరం చేశారు. మొక్కల పెంపకం కోసం కవర్లల్లో మట్టి నింపడం..విత్తనాలు విత్తడం.. మొక్కల సంరక్షణ పక్కాగా కొనసాగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News February 1, 2025
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నిధులు కేటాయించండి:ఎంపీ
నేడు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాకు నిధులు కేటాయించాలని ప్రతిపాదించినట్లు MP రఘురాంరెడ్డి తెలిపారు. KTDMఎయిర్పోర్ట్, భద్రాచలం-కొవ్వూరు రైల్వేలైన్, KMM-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే, KMM- VJD హైవేకు నిధులు కేటాయించాలని కోరినట్లు వెల్లడించారు. KTDM కలెక్టరేట్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, కిన్నెరసానిపై వంతెన నిర్మాణానికి సైతం నిధులు కేటాయించాలని కోరారు.
News January 31, 2025
గొంగడి త్రిష సూపర్ ఫామ్ కంటిన్యూ
భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిష అండర్ -19 టీ20 ప్రపంచ్ కప్లో సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తోంది. ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో 35 పరుగులతో రాణించి గెలుపులో కీలకంగా మారింది. కాగా ఇటీవల స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో టీ20ల్లోనే తొలి సెంచరీతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఫైనల్లోనూ ఉత్తమ క్రీడా ప్రదర్శన చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.
News January 31, 2025
బోనకల్ ఘటనపై పొంగులేటి దిగ్భ్రాంతి
బోనకల్ సమీపంలోని సాగర్ కెనాల్ వద్ద ట్రాక్టర్ బోల్తాపడి ఒక మహిళా కూలీ మృతి చెందగా, పలువురికి గాయాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఖమ్మం ప్రభుత్వాస్పత్రి వైద్యులను ఆదేశించారు.