News September 4, 2024

ఖమ్మం: వరదల్లో పోయిన సర్టిఫికెట్లు ఈ నెల 11న జారీ

image

ఖమ్మం జిల్లాలో వరదతో సర్టిఫికెట్లు కోల్పోయిన వారి
కోసం ఈనెల 11న కలెక్టరేట్లో ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. అయితే, విదేశాల్లో ప్రవేశాలు, తదితర అవసరాలకు అత్యవసరంగా సర్టిఫికెట్లు అవసరమైతే హాట్ లైన్ నంబర్ తెలియజేయాలని.. వారికి ప్రొవిజనల్ సర్టిఫికెట్లు సమకూరుస్తామని చెప్పారు. మిగతా వారు ఈనెల 11న జరిగే శిబిరానికి హాజరుకావాలని కలెక్టర్ సూచించారు.

Similar News

News January 15, 2025

ఖమ్మంలో: యువకుడి మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన

image

ఖమ్మం గ్రామీణ మండలం పోలెపల్లి పంచాయతీ రాజీవ్ గృహకల్పకు చెందిన <<15158548>>సంజయ్‌కుమార్ <<>>తన అన్న సాయిని పిక్‌అప్ చేసుకోడానికి వెళ్లి మిస్సయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కెనాల్ కాలువలో ఆ యువకుడి డెడ్ బాడీ లభించడం కలకలం రేపింది. యువకుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడి బంధువులు, స్నేహితులు రోడ్డుపై బైఠాయించి, ధర్నా చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News January 15, 2025

KMM: మేకపోతులు కొనేందుకు వెళ్తుండగా యాక్సిడెంట్ 

image

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో వ్యక్తికి గాయాలైన ఘటన పెనుబల్లి మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. పార్థసారథిపురం గ్రామానికి చెందిన కీసర రాజు, కుంజా మహేశ్‌ కనుమ కావడంతో బైక్‌పై మేకపోతులు కొనేందుకు వెళుతున్నారు. ఈ క్రమంలో ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. రాజు అక్కడికక్కడే మృతిచెందగా.. మహేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 15, 2025

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} పినపాకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన ∆} జూలూరుపాడులో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యాటన ∆} అమ్మపేటలో మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన