News February 23, 2025
ఖమ్మం: వారం రోజుల వ్యవధిలో అత్తా, కోడలు మృతి

వారం రోజుల వ్యవధిలో అత్తా, కోడలు మృతి చెందిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు ప్రకారం.. మద్దివారిగూడెంకు చెందిన వీరవెంకటమ్మ కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ 4రోజుల క్రితం మృతి చెందింది. ఆమె అంత్యక్రియలు పూర్తికాగా, అప్పటికే క్యాన్సర్‌తో బాధపడుతున్న వీరవెంకటమ్మ కోడలు కృష్ణవేణి సైతం శనివారం మృతి చెందింది. వారం వ్యవధిలోనే అత్తాకోడళ్లు మృతి చెందడంతో విషాద ఛాయలు అమ్ముకున్నాయి.
Similar News
News February 23, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤ కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు ➤ ఆదోనిలో ఘోరం.. బాలుడిపైకి దూసుకెళ్లిన లారీ ➤ మంత్రాలయం శ్రీ మఠంలో ఆకట్టుకున్న భరతనాట్యం ➤ ఎమ్మిగనూరు ఎస్ఎంఎల్ కాలేజీలో 25న జాబ్ మేళా ➤ జిల్లాలో చికెన్‌కు తగ్గిన డిమాండ్ ➤ రూ.1.15 లక్షల కర్ణాటక మద్యం స్వాధీనం ➤ జిల్లాలోని ఆలయాల్లో మొదలైన మహా శివరాత్రి సందడి
News February 23, 2025
నంద్యాల జిల్లా నేటి ముఖ్యాంశాలు

☞ శ్రీశైలానికి ఎంపీ శబరి పాదయాత్ర
☞ గడివేముల మండలంలో పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
☞ నెల్లూరు జిల్లాలో మంత్రి బీసీ పర్యటన
☞నంద్యాలలో ర్యాలీని జయప్రదం చేయండి: బొజ్జా
☞ చెంచు మహిళలకు కుట్టు మెషీన్లు పంపిణీ
☞ శ్రీశైలంలో ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం
☞ ప్రొద్దుటూరులో ట్రాక్టర్ బోల్తా.. ఆళ్లగడ్డ డ్రైవర్ మృతి
☞ ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు: కర్నూలు కలెక్టర్
News February 23, 2025
జిల్లాలో గ్రూప్-2 మెయిన్స్ ప్రశాంతం : కలెక్టర్

ఎన్టీఆర్ జిలాల్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ లక్ష్మీశ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడలోని 19 కేంద్రాల్లో 8,792 మంది అభ్యర్థులకు పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేయగా.. ఉదయం జరిగిన పేపర్-1కు 83.89 శాతం (7,376), మధ్యాహ్నం పేపర్-2కు 83.62 శాతం (7,352) మంది హాజరైనట్లు వెల్లడించారు.