News March 13, 2025
ఖమ్మం: విషాదం.. BRS నాయకుడి కుమార్తె మృతి

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం యడవల్లిలో కొంతకాలంగా లివర్ వ్యాధితో బాధపడుతున్న BRS నాయకుడు చేరుకుపల్లి భిక్షం రెండో కుమార్తె చేరుకుపల్లి శిరీష(23) శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి ఈరోజు మృతిచెందిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె మృతితో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రులయ్యారు. గ్రామస్థులు ఆమె అకాల మరణంపై విచారం వ్యక్తం చేశారు. శిరీష మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News March 14, 2025
MHBD: బాల్యంలో ఈ పూలతోనే హోలీ (PHOTO)

MHBDలో ఓ చెట్టుకు విరబూసిన పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్తుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకోండి. HAPPY HOLI
News March 14, 2025
కొత్తగూడెం: వ్యవసాయ కూలీకి రూ.22 లక్షల టాక్స్

కూలీ నాలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండల కేంద్రానికి చెందిన జానపాటి వెంకటేశ్వర్లుకు అక్షరాల రూ.22,861,04 జీఎస్టీ చెల్లించాలని విజయవాడ కార్యాలయం నుంచి నోటీసు వచ్చింది. నిరక్షరాస్యుడైన బాధితుడు విషయం తెలుసుకొని ఆందోళన చెందుతున్నాడు. పాన్‌కార్డు కూడా లేని తనకు గ్రానైట్ వ్యాపారం చేస్తున్నారని నోటీసు వచ్చిందని, న్యాయం చేయాలని కోరుతున్నాడు.
News March 14, 2025
HYD: హోలీ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత: సీపీ

35 ఏళ్ల తర్వాత ఒకే రోజు హోలీ, రంజాన్ మాసంలో రెండవ శుక్రవారం ఒకేరోజు రావడంతో HYD సీపీ సీవీ ఆనంద్ అధికారులను అప్రమత్తం చేశారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. ప్రతీ జోన్, సున్నితమైన ప్రాంతాల్లో పికెట్‌లు ఏర్పాటు చేయాలని, అసాంఘిక శక్తులపై కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని అధికారులకు ఆదేశించారు. అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, డీసీపీ చైతన్య కుమార్ పాల్గొన్నారు.