News March 27, 2024
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజులు సెలవులు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజులు సెలవులు ప్రకటించారు. ఈనెల 29న గుడ్ ఫ్రైడే, శనివారం, ఆదివారం వారాంతరపు సెలవులు సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. తిరిగి సోమవారం మార్కెట్ పునఃప్రారంభమై క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని మార్కెట్ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోనే రైతులు గమనించాలన్నారు.
Similar News
News December 17, 2025
ఖమ్మం: తుది దశలో మొదటి సర్పంచిగా విజయం

కల్లూరు మండలంలో బుధవారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో తెలగారం గ్రామానికి చెందిన స్వతంత్ర అభ్యర్థి యల్లమందల విజయలక్ష్మి విజయం సాధించారు. 49 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో ఆమె అనుచరులు స్థానికులు విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నారు. గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని, తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ సూర్యకాంత ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
News December 17, 2025
ముగిసిన ‘పంచాయతీ’ సమరం.. ఫలితంపై ఉత్కంఠ

ఖమ్మం జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల కోలాహలం ముగిసింది. అభ్యర్థులు ఓటర్ల ప్రసన్నం కోసం మద్యం, మాంసం, బాండ్ పేపర్లతో హామీలిచ్చారు. హోరాహోరీ ప్రచారం తర్వాత పోలింగ్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపైనే నెలకొంది. లక్షల్లో ఖర్చు చేసిన అభ్యర్థుల్లో గెలుపుపై గుబులు మొదలైంది. మరికొద్ది గంటల్లో గ్రామరథ సారధులు ఎవరో తేలిపోనుంది. విజయం ఎవరిని వరిస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
News December 17, 2025
ఖమ్మం: ముగిసిన మూడో విడత.. 86.65% ఓటింగ్

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 86.65 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా వెల్లడించారు. పోలింగ్ ముగియడంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మరికొద్ది సేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించి ఫలితాలను వెల్లడించనున్నారు.


