News June 13, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,100 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,000 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్న, ఈరోజు ఏసీ మిర్చి ధర, పత్తి ధర స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్ కు వచ్చే రైతులు నిబంధనలు పాటించాలని సూచించారు

Similar News

News October 4, 2024

ఖమ్మం: పువ్వాడ సైలెంట్.. ఎందుకు..?

image

ఖమ్మం జిల్లా బీఆర్ఎస్‌లో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ సైలెంట్ అయ్యారనే చర్చ నడుస్తొంది. జిల్లాలో జరిగే పార్టీ కార్యక్రమాలకు హాజరవడం లేదని, ఏదో అడపాదడపా HYDలో జరిగే ప్రెస్ మీట్‌లకు హాజరవుతున్నారని శ్రేణులు చర్చించుకుంటున్నాయి. పువ్వాడ ఎందుకు సైలెంట్ అయ్యారనే విషయం తమకు తెలియదని, తిరిగి పువ్వాడ జిల్లాలో యాక్టివ్ పాలిటిక్స్ చేసి, జోష్ పెంచాలని పలువురు నేతలు అంటున్నారు. దీనిపై మీ కామెంట్?

News October 4, 2024

ఖమ్మం: దసరా సందర్భంగా క్రేజీ ఆఫర్

image

దసరా సందర్భంగా నేలకొండపల్లిలో యువకులు విచిత్రమైన బంపర్ ఆఫర్ ఏర్పాటు చేశారు. వంద రూపాయలు పెట్టి కూపన్ కొనుగోలు చేస్తే మొదటి బహుమతి 10కిలోల మేక, రెండు, మూడు, నాలుగు బహుమతులు మద్యం బాటిళ్లు, నాటు కోళ్లు లక్కీ డ్రా ద్వారా అందించనున్నట్లు యువకులు పేర్కొన్నారు. ఈ నెల 10న నేలకొండపల్లిలో లక్కీ డ్రా ఉంటుందని తెలిపారు. ఈ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

News October 4, 2024

ఖమ్మం: ప్రతి హాస్టల్ విద్యార్ధులతో ఫుడ్ కమిటీ ఏర్పాటు: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లాలో ఉన్న గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ళ నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రతి హాస్టల్లో విద్యార్థులతో ఫుడ్ కమిటీ ఏర్పాటు చేయాలని, ఆహార పదార్థాల డెలివరీ, స్టోరేజిలో వీరిని భాగస్వామ్యం చేయాలన్నారు.