News June 20, 2024
ఖమ్మం: వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్షా
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం వ్యవసాయశాఖ అధికారులతో వానాకాలం పంటసాగు వివరాలు, ఎరువుల నిల్వలు, సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాగు వివరాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జూన్ 19 వరకు 17,50,000 ఎకరాలలో వివిధ పంటలు సాగు అయ్యాయని, ఇందులో అత్యధికంగా ప్రత్తి 15,60,677 ఎకరాలలో.. తరువాత కంది పంట 76,000 ఎకరాలలో సాగు అయిందని మంత్రికి అధికారులు వివరించారు.
Similar News
News November 29, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్య అంశాలు
∆} ఖమ్మం:రైతుకు ఏది మేలు అయితే అదే అమలు చేస్తాం: తుమ్మల∆} ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను కలిసిన సత్తుపల్లి ఎమ్మెల్యే∆}కొత్తగూడెం: కోచింగ్ లేకుండానే మూడు ఉద్యోగాలు∆} వైరా:భర్తపై భార్య కత్తితో దాడి∆} మధిర: షిఫ్ట్ కారులో వచ్చి పలు ఇండ్లలో దొంగతనాలు∆} మణుగూరు: జర్నలిస్టులపై కేసు కొట్టివేత∆}వెంకటాపురం:ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి
News November 29, 2024
మంత్రి తుమ్మల వ్యాఖ్యలపై మీ కామెంట్..?
రైతు బంధుపై మంత్రి తుమ్మల ‘మహబూబ్ నగర్ రైతు పండుగ’ సభలో ఈరోజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘రైతుబంధు కంటే సన్నవడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ బాగుందని రైతులు అంటున్నారు’ అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. తాము రైతులకు కల్లబొల్లి కబుర్లు చెబుతూ పల్లకీలో ఊరేగించబోమని, ప్రభుత్వం తరఫున చేయాల్సినంత చేస్తామన్నారు. మంత్రి వ్యాఖ్యలపై మీ కామెంట్ తెలపండి.
News November 29, 2024
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటాలు ఏసీ మిర్చి ధర రూ.16,325 జెండా పాట పలకగా, క్వింటాలు పత్తి ధర రూ.7,200 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర రూ.75 తగ్గగా, పత్తి ధర మాత్రం రూ.50 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్‌కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.