News March 1, 2025

ఖమ్మం: సంక్షేమ బోర్డును ఎత్తివేసే కుట్ర: ప్రవీణ్

image

తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఖమ్మం జిల్లా 4వ మహాసభలు శనివారం ఖమ్మం నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. సంఘం జెండా ఆవిష్కరణ అనంతరం జరిగిన మహాసభలో వారు మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికుల కోసం ఎన్నో పోరాటాలు చేసి తెచ్చిన సంక్షేమ బోర్డును ఈ ప్రభుత్వం ఎత్తివేయాలనే కుట్ర పన్నుతుందని ఆరోపించారు.

Similar News

News March 3, 2025

BRS నేత సుబ్బారావుకు KCR రూ.10 లక్షల ఆర్థిక సాయం

image

ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఖమ్మం టౌన్ పార్టీ మాజీ అధ్యక్షుడు డోకుపర్తి సుబ్బారావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సుబ్బారావును ఎర్రవెల్లిలోని ఫాంహౌస్‌కు ఆహ్వానించి ఆయన ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్య ఖర్చుల కోసం రూ.10లక్షల చెక్కును స్వయంగా సుబ్బారావుకు అందజేశారు.

News March 2, 2025

ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్య అంశాలు

image

✓: ఖమ్మం: ‘రాణా పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యా యత్నం’✓: 8న లోక్ అదాలత్: కారేపల్లి ఎస్ఐ✓: నేలకొండపల్లి:పొంగులేటి చొరవతో షాదీఖానాకు రూ.50లక్షలు✓:ఖమ్మం: ‘ఆలయం ఎదుట అశ్లీల నృత్యాలు’✓ ఖానాపురం:తప్పుడు పత్రాల రిజిస్ట్రేషన్ల ముఠాపై కేసు నమోదు✓చింతకాని: కారులోనే లింగ నిర్ధారణ పరీక్షలు.. ఇద్దరు అరెస్ట్✓:ఖమ్మం: 20లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు: మంత్రి తుమ్మల

News March 2, 2025

కొత్తగూడెంకి ఎయిర్ పోర్ట్‌.. కేంద్రమంత్రి క్లారీటీ..!

image

కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. గతంలో ప్రభుత్వం ఓ స్థలం కేటాయించిందని.. కానీ ఆస్థలం ఫీజుబిలిటీ లేదని ప్రభుత్వానికి తెలపగా మరో స్థలం కేటాయించిందన్నారు. అక్కడ AAI ఫీజుబిలిటీ స్టడీ చేసిందన్నారు. కానీ ఆ స్థలానికి రిమార్క్స్ ఉన్నాయని ఆ ప్రాంతం డేటా కావాలని ప్రభుత్వానికి సూచించామన్నారు. ఆ డేటా వచ్చిన తరువాత పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

error: Content is protected !!